Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema Reviews Manjummel Boys Review And Rating In Telugu Ntv Review

Manjummel Boys Review: మలయాళ ఇండస్ట్రీ హిట్ ‘మంజుమ్మల్ బాయ్స్’ రివ్యూ..

Published Date :April 6, 2024 , 8:02 am
By Bhargav Chaganti
Manjummel Boys Review: మలయాళ ఇండస్ట్రీ హిట్ ‘మంజుమ్మల్ బాయ్స్’ రివ్యూ..
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rating : 3 / 5

  • MAIN CAST: సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, బాలు వర్గీస్, గణపతి, జీన్ పాల్ లాల్, చందు సలీంకుమార్, దీపక్ పరంబోల్, అభిరామ్ రాధాకృష్ణన్, అరుణ్ కురియన్, ఖలీద్ రెహమాన్
  • DIRECTOR: చిదంబరం
  • MUSIC: Sushin Shyam
  • PRODUCER: Babu Shahir, Soubin Shahir, Shawn Antony

Manjummel Boys Review: మలయాళంలో ఈ ఫిబ్రవరిలో రిలీజ్ అయిన మూడు సినిమాలు మంచి హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ముందుగా వచ్చిన ప్రేమలు, తరువాత వచ్చిన భ్రమ యుగం సినిమాలు మంచి హిట్ అయ్యాయి. అందులో భ్రమ యుగం తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఇక ప్రేమలును కూడా తెలుగు రిలీజ్ చేయగా సూపర్ హాయ్ అయింది. మంజుమ్మల్ బాయ్స్ అనే సినిమా 22వ తేదీ ఫిబ్రవరి నెలలో రిలీజ్ అయి హిట్ టాక్ తో దూసుకుపోయి మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. మైత్రీ సంస్థ తెలుగులో ఈ సినిమాను ఏప్రిల్ 6న రిలీజ్ చేసింది. ఇక ఈ సినిమా ఎలా ఉంది అనేది ఇప్పుడు మనం రివ్యూలో చూద్దాం పదండి.

మంజుమ్మల్ బాయ్స్ కథ:
తమిళనాడులోని కొడైకెనాల్‌లోని గుణ గుహల వద్ద జరిగిన విషాదాన్ని ఎదుర్కొన్న కొచ్చికి చెందిన మంజుమ్మల్‌కు చెందిన 11 మంది యువకుల కథ ఇది. 2006లో జరిగిన రియల్ స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు మేకర్స్. కొచ్చికి చెందిన మంజుమ్మల్‌ అనే ప్రాంతానికి చెందిన 11 మంది కొడైకెనాల్ ట్రిప్ వెళ్తారు. తమ ప్రత్యర్థి బృందం మున్నార్‌కు విహారయాత్రకు వెళ్లడాన్ని చూసి అసూయతో కొడైకెనాల్‌కు వెళ్లాలని నిర్ణయింకుంటారు. అక్కడకి వెళ్లి కమల్ హాసన్ గుణ సినిమా షూటింగ్ జరిగిన లొకేషన్ -గుణ కేవ్స్ చూడాలని అనుకుంటాకుంటారు. నిషేధిత ప్రాంతం అని తెలిసి కూడా వాళ్ళు లోపలికి వెళ్లాలని అనుకుంటారు. అలా వెళ్లిన క్రమంలో సుభాష్(శ్రీనాథ్ బాషి) ఒక లోతైన గోతిలో పడిపోతాడు. పోలీసుల దగ్గరకు వెళ్తే మీరే తోసేసి ఉంటారని అనడంతో ఆ కుర్రాళ్లకు ఏమీ అర్థం కాదు. అంతేకాదు అక్కడ 13 మంది మరణించారు కాబట్టి మీ వాడిని మరచిపోమంటారు. మీడియాకి విషయం పొక్కడంతో అక్కడికి వెళ్లిన పోలీసులకి లోపల పడిన వ్యక్తి బ్రతికే ఉన్నాడని అర్థం అవుతుంది. దీంతో ఫైర్ డిపార్ట్మెంట్ తో పాటు ఫారెస్ట్ టీం కూడా వస్తుంది. అయితే మనిషి దూరడానికి కూడా లేని ఆ గోతిలో పడ్డ సుభాష్ ను బయటకు తీసుకొచ్చారా? సుశిక్షితులు అయిన ఫైర్ సిబ్బందే లోపలికి వెళ్ళడానికి భయపడినప్పుడు ఆ మిగతా 10 మంది స్నేహితులు ఏమి చేశారు? చివరికి ఏమైంది? అనేదే ఈ సినిమా కథ.

Also Read

  • Gedela Raju Review: గేదెల రాజు రివ్యూ
  • రివ్యూ : పరమపద సోపానం
  • Vaazha 2 Review: వాలా 2 మూవీ రివ్యూ
  • Therachapa Review: తెరచాప రివ్యూ

విశ్లేషణ:
మంజుమ్మల్ బాయ్స్‌ సినిమా ఓపెనింగ్ లోనే ఒక కుర్రాళ్ళ గుంపు వివాహ విందులో ఆహ్వానించబడని అతిథులుగా వెళ్లి సరదాగా గడపడమే కాకుండా వారికి ప్రత్యర్థి గ్యాంగ్‌తో గొడవలకు దిగడం కొంచెం వింతగా అనిపిస్తుంది. ఇక ఆ తర్వాత కథలోకి తీసుకు వెళ్ళడానికి కూడా బాగా సమయం తీసుకున్నాడు దర్శకుడు. అందుకే కథ కొంచెం సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. ఇక ఎప్పుడైతే ఈ గ్యాంగ్ అంతా కలిసి ట్రిప్ బయలు దేరతారో అప్పుడు సినిమా వేగం పుంజుకుంటుంది. ఇక కొడైకెనాల్ వెళ్లడం, అక్కడ గుణ కేవ్స్ చూసేందుకు లోపలికి వెళ్లి సుభాష్ అందులో పడడంతో ఒక్కసారిగా అందరూ స్టన్ అయ్యేలా రాసుకున్నాడు డైరెక్టర్. ఎప్పుడైతే ఒక మనిషి గుంతలో పడ్డాడో మరుక్షణం నుంచి థియేటర్ లోని వారంతా షాకయ్యి తరువాత ఏం జరగనుంది? అనే టెన్షన్ లో పడిపోతారు. ఇక కమల్ హాసన్ పట్ల తనకున్న ప్రత్యేక ఆసక్తి గురించి దర్శకుడు చిదంబరం టైటిల్స్ లోనే క్లారిటీ ఇచ్చేస్తాడు. ఇక ఇలాంటి థ్రిల్లర్ సినిమాల్లో చూసే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి బదులుగా సెకండాఫ్‌లో వచ్చే ఒక హై మూమెంట్ లో అదే పాటను పే ఆఫ్‌గా ఉపయోగించి ట్రిబ్యూట్ ఇవ్వడం ఆసక్తికరంగా ఉంటుంది. నిజానికి సెకండాఫ్ మొత్తం థియేటర్ లో ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోతారు. క్లైమాక్స్ లో కొన్ని సీన్స్ కు అప్రయత్నంగానే చప్పట్లు కొట్టించేస్తాడు డైరెక్టర్. అయితే మళయాల సినిమాతో పోలిస్తే తెలుగులో కొన్ని సీన్స్ కట్ చేశారు. సినిమా మొదటి 20 నిమిషాల్లో ప్రేక్షకులకి చూపిన ప్రతి విషయానికి క్లైమాక్స్ కి లింక్ చేస్తూ డైరెక్టర్ చేసిన మ్యాజిక్ బాగుంది. చిన్ననాటి విషయాలను ప్రస్తుత కాలానికి లింక్ చేస్తూ చేసిన స్క్రీన్‌ప్లే మ్యాజిక్ సినిమాకి ప్రత్యేకమైన గుర్తింపు తీసులొస్తుంది. లైఫ్ అనేది సర్వైవల్ ఆఫ్ ది ఫిట్‌టెస్ట్ అని మనం చాలా సార్లు వింటూనే ఉంటాం. అలాంటి సర్వైవల్ థ్రిల్లర్‌లలో మంజుమ్మల్ బాయ్స్ ఒక మంచి ఆప్షన్.

నటీనటుల విషయానికి వస్తే మెయిన్ పాత్ర అయిన సుభాష్‌గా శ్రీనాథ్ భాసి అద్భుతమైన నటనను కనబరిచాడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో ప్రేక్షకులు కూడా అతని బాధను అనుభవించేలా చేయడం మామూలు విషయం కాదు. ఇక కుట్టన్ గా శౌబిన్ షాహిర్ కూడా సరిగ్గా సెట్ అయ్యారు. మంజుమ్మల్ బాయ్స్ అందరూ తెర మీద మ్యాజిక్ చేశారు.  ఇక ఖైదీ ఫేమ్ జార్జ్ మరియన్ అలాగే మరియు మరికొందరు తమిళ నటులు కూడా తమ తమ పాత్రల పరిధి మేరకు ఆకట్టుకునేలా నటించారు. ఇక టెక్నీకల్ టీం విషయానికి వస్తే అన్ని క్రాఫ్ట్స్‌లో షైజు ఖలీద్ సినిమాటోగ్రఫీ స్పెషల్ అనిపిస్తుంది. ప్రేక్షకులు టెన్షన్‌ను అనుభవించేలా అద్భుతమైన పనితనం చూపాడు. ఇక ఆర్ట్ డైరెక్టర్ ను మెచ్చుకోకుండా ఉండలేరు. సుశిన్ శ్యామ్ అందించిన సంగీతం అద్భుతంగా చేసిన సౌండ్ డిజైన్‌కి బాగా కలిసొచ్చింది. ఇక కొంత కత్తిరించాల్సి ఉన్నా ప్రేక్షకులను సీట్లకు అతుక్కుపోయేలా చేయడంలో సఫలం అయ్యారు. అయితే తెలుగు వెర్షన్ డైలాగ్స్ అతి లేకుండా సెట్ అయ్యాయి,

ఇక ఫైనల్ గా: ఇండియన్ మూవీ హిస్టరీలో వచ్చిన అతి తక్కువ సర్వైవల్ థ్రిల్లర్స్ లో ఈ సినిమా ది బెస్ట్ గా నిలుస్తుంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Manjummel Boys Rating
  • Manjummel Boys Review
  • Manjummel Boys Review update
  • Manjummel Boys Reviews
  • Manjummel Boys telugu Review

తాజావార్తలు

  • Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?

  • Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..

  • Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్‌లో వలస నేతల డామినేషన్

  • Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..

  • RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!

ట్రెండింగ్‌

  • 7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!

  • 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్‌, 120Hz AMOLED డిస్‌ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions