Skanda Trailer: రామ్ పోతినేని శ్రీ లీల జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం స్కంద. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిన స్కంద సెప్టెంబర్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మేకర్ ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఇందులో భాగంగానే నేడు స్కంద రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఇక ఇదే ఈవెంట్ లో స్కంద ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు ఈ ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. రామ్ ను ము నపెన్నడూ చూడని మాస్ అవతారంలో బోయా ప్రజెంట్ చేశాడు.
Karthikeya: హీరోను బ్లాక్ మెయిల్ చేస్తున్న యువతి.. ఆ పని చేయకపోతే చెయ్యి కోసుకుంటా అంటూ
” ఇయ్యాలే.. పొయ్యాలే.. గట్టిగా అరిస్తే తొయ్యాలే.. అడ్డమొస్తే లేపాలే” అని రామ్ చెప్తున్న మాస్ డైలాగ్ తో ట్రైలర్ మొదలయ్యింది. ఇక కాలేజ్ లో ఎవ్వరిని లెక్కచేయని కుర్రాడిగా కనిపించిన రామ్.. ఊరిలో మాస్ అవతార్ లో కనిపించాడు. ఇక ఇందులో కూడా బోయా తన మార్క్ చూపించాడు. రెండు ఊర్లు.. పదవి కోసం పోరాటం.. అందుకోసం హీరో కుటుంబంపై విలన్ కన్ను వేయడం.. హీరో చెల్లిని.. విలన్ కొడుకు కు ఇచ్చి పెళ్లి చేసినట్లు.. ఆమెను వారు చంపేసినట్లు చూపించారు. ఇక చెల్లెలిని చంపిన కుటుంబంపై హీరో ఎలా పగ తీర్చుకున్నాడు అనేది సినిమా కథగా తెలుస్తోంది. అస్సలు రామ్ చివరి షాట్ అయితే నభూతో నభవిష్యత్ అన్నట్లు ఉంది. ఊర మాస్ లుక్ లో రామ్ ను గుర్తుపట్టడం కూడా కష్టం అనే చెప్పాలి. పొడుగాటి జుట్టు.. మాసిన గడ్డం.. డీ గ్లామర్ గా రామ్ ఫైర్ చూస్తుంటే గూస్ బంప్స్ రావడం ఖాయం అనిపిస్తుంది. ఇక థమన్ మ్యూజిక్.. రామ్ తెలంగాణ స్లాంగ్ హైలైట్ గా నిలిచాయి. ట్రైలర్ తోనే సినిమాపై ఒక్కసారిగా హైప్ తెచ్చేసారు. మరి ఈ సినిమా ఎలాంటి హిట్ ను అందుకుంటుందో చూడాలి.