Sirf Ek Banda Kafi Hai Trailer: మనోజ్ బాజ్ పాయ్.. చూడడానికి చాలా సింపుల్ గా కనిపిస్తాడు. కానీ, ఆయన చేసే సినిమాలు.. నటించే పత్రాలు చాలా చాలా హెవీగా ఉంటాయి. ఒకసారి సైకోలా కనిపిస్తే.. ఇంకోసారి స్పై లా కనిపిస్తాడు. ఒకసారి ఫ్యామిలీ మ్యాన్ లా ఉంటాడు.. ఇంకోసారి పోలీస్ గా.. పాత్ర ఏదైనా అందులో జీవించేస్తాడు. ఇక తాజాగా మనోజ్ నటించిన వెబ్ ఫిల్మ్ ‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’. అపూర్వ సింగ్ కర్కి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్‌తో పాటు భన్సాలి స్టూడియోస్ బ్యానర్స్‌పై వినోద్ భన్సాలి, కమలేష్ భన్సాలి, విశాల్ గుర్నాని, అసిఫ్ షేక్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం ఈ సినిమా హిందీ వెర్షన్ జీ5 లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ సినిమా తెలుగు వెర్షన్ జూన్ 7 న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా తెలుగు ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
Mahesh Babu: మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సూర్య భాయ్ మళ్లీ వస్తున్నాడు
‘సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ లో మనోజ్.. లాయర్ గా కనిపించాడు. ఒక 16 ఏళ్ల బాలికను.. ఒక స్వామిజీ అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇక ఆ వాస్తవాన్ని ఆమె సమాజానికి చెప్పాలని అనుకుంటుంది. అందుకోసం న్యాయస్థానాన్ని నమ్ముకుంటుంది. కానీ, సమాజంలో పెద్దమనిషిగా చెలామణి అవుతున్న స్వామిజీ పై ఎవరు వాదించడానికి రారు. ఆ సమయంలోనే ఆ బాలికకు మనోజ్ తోడుగా నిలుస్తాడు. స్వామిజీకి ఎదురు నిలబడతాడు. లోకాన్ని మొత్తం ఎదురించి ఆ బాలికకు న్యాయం చేశాడా..? ఈ కేసు వలన మధ్యలో మనోజ్ ఎదుర్కున్న సమస్యలు ఏంటి అనేది కథగా కనిపిస్తుంది ఇక వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కినట్లు ట్రైలర్ లో చూపించి మరింత ఆసక్తిని పెంచేశారు. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో మనోజ్.. ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.