చలన చిత్ర సనిశ్రమలో అత్యంత ఆదరణ పొందిన గాయకుల్లో ఉదిత్ నారాయణ ఒకరు. ఆయన దక్షిణాది సంగీత ప్రియులకు కూడా బాగానే పరిచయం.‘చూడాలని ఉంది’ మూవీలో ఆయన పాడిన ‘రామ్మా చిలకమ్మా’ పాటతో తెలుగు ప్రేక్షకులను ఒక ఊపు ఊపేశారు. తర్వాత ఓ దశాబ్దం పాటు బోలెడన్ని పాటలు పాడాడు.ఆయన పాడిన ప్రతి పాటా సూపర్ హిట్టే. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ గత రెండు రోజులుగా ఈ సింగర్ ఉదిత్ నారాయణ ముద్దు వివాదం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. కాన్సర్ట్‌లో లేడీ ఫ్యాన్ తనతో సెల్ఫి తీసుకుంటుండగా ఉదిత్ నారాయణ్ లిప్ కిస్ ఇవ్వడం వివాదంగా మారింది.నెటిజన్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అయితే దీనిపై స్పందించి నారాయణ్ కొన్ని రోజుల ముందు జరిగిన ఈ ఈవెంట్‌కు సంబంధించిన వీడియోలను ఇప్పుడెందుకు వైరల్ చేసి వివాదం చేస్తున్నారు.. ఇదంతా ఎవ్వరో కావాలని నాపై కుట్రపూరితంగా దుష్ప్రచారం చేస్తున్నారు అని ఆయన వాపోయ్యారు. ఈ వీడియోను చెడు దృష్టితో చూస్తున్నారు. నాకు నా అభిమానులకు మధ్య స్వచ్ఛమైన బంధం ఉంది.. తమ మధ్య ఉన్న ప్రేమనే ఆ వీడియోలో ఉంది అని నారాయన్ తెలిపాడు. తప్పు అనిపించి ఉంటే సారీ అని తెలిపారు. ఇక తాజాగా ఈ విషయంపై స్టార్ సింగర్ చిన్మయి స్పందించింది.
మహిళలు, పిల్లలపై ఏదైనా చెడు జరిగినప్పుడు సెలబ్రిటీల నుంచి మొదటగా స్పందించేది సింగర్ చిన్మయి. క్యాస్టింగ్ కౌచ్‌పై కూడా ఆమె ఎన్నోసార్లు తీవ్ర ఆరోపణలు చేసింది. దీంతో సింగర్ ఉదిత్ నారాయణ్ ముద్దు వివాదంపై కూడా ఆమె రియాక్ట్ అయింది..‘ఉదిత్ నారాయణ్ ఓ అమ్మాయికి లిప్ కిస్ ఇచ్చినందుకు సోషల్ మీడియా మొత్తం భగ్గుమంది. కానీ అదే సోషల్ మీడియా ఆడవారిని వేధించిన అను మాలిక్, వైరముత్తు, కార్తిక్ లాంటి ఎంతోమందికి సపోర్ట్‌గా నిలిచింది. ఇది ద్వంద్వ వైఖరి కాదు.. అంతకు మించి. ఇలాంటి అభిప్రాయాల్ని మాత్రం 6 వేల అడుగుల లోతులో పాతిపెట్టేశారు’ అంటూ చిన్మయి ట్వీట్ లో పేర్కొంది.