Shreya Reddy Joins OG Shoot: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయం చేస్తూ మరోపక్క సినిమాల్లో బిజీబిజీగా గడుపుతున్నారు. ఇప్పటికే ఆయన అనేక సినిమాలను లైన్లో పెట్టారు. ఒక సినిమా షూటింగ్ గ్యాప్ లో మరో సినిమా షూటింగ్ చేస్తూ వస్తున్నారు. అయితే ప్రస్తుతానికి సినిమాలన్నీ పక్కనపెట్టి వారాహి యాత్ర పేరుతో ఆయన ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ యాత్ర మొదలు పెట్టబోతున్నారు. అయితే ఆయన హీరోగా సాహో సుజిత్ దర్శకత్వంలో ఓజి అనే సినిమా రూపొందుతోంది. డివివి దానయ్య నిర్మాణంలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో విశాల్ వదిన శ్రేయ రెడ్డి ఒక కీలక పాత్రలో నటిస్తోంది.
Also Read: Lavanya Tripati : పెళ్లి చేసుకోవడానికి కండిషన్ పెట్టిన లావణ్య త్రిపాఠి..?
Also Read: Jabardasth Ritu Choudhary: రీతూ చౌదరి రహస్యంగా పెళ్లి చేసుకుందా?