Rangamarthanda: చాలా గ్యాప్ తరువాత కృష్ణవంశీ.. రంగమార్తాండ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ జంటగా నటిస్తుండగా.. కుర్ర జంటగా సింగర్ రాహుల్ సిప్లిగంజ్, శివాత్మిక రాజశేఖర్ నటిస్తున్నారు. ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాడు కృష్ణవంశీ.
టాలీవుడ్ స్టార్ హీరో డా. రాజశేఖర్, జీవిత ల ముద్దుల కూతుళ్లు శివాని, శివాత్మిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు తల్లిదండ్రుల బాటలోనే టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి విజయాలను అందుకుంటూ స్టార్లు గా ఎదగడానికి ప్రయత్నిస్తున్నారు. ఇక దొరసాని తో తెలుగు తెరకు పరిచయమైన శివాత్మిక ఇటీవల దుబాయ్ లో హల్చల్ చేస్తున్న సంగతి తెల్సిందే. ఎప్పుడు ఫ్యామిలీతో సందడి చేసే ఈ ముద్దుగుమ్మ ఒక్కసారిగా దుబాయ్ లో ఒక్కత్తే ఫోటోలకు పోజులు…