Prabhas:పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. షూటింగ్స్, ఇల్లు తప్ప డార్లింగ్ బయట చాలా తక్కువ కనిపిస్తాడు. ఇక ఎప్పుడో ఒక్కసారి మాత్రమే వేరే హీరోల ఫంక్షన్స్ కు గెస్ట్ గా వెళ్తూ ఉంటాడు. అలా వెళ్లినా కూడా స్పీచ్ ను రెండు ముక్కలో తేల్చేస్తాడు. ఇక స్పీచ్ పక్కన పెడితే స్టేజిపై డార్లింగ్ ని చూడొచ్చు అని అభిమానులు ఆశపడుతూ ఉంటారు. ఇక ఇటీవలే ప్రభాస్, సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా వస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం విదితమే. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 5 న ప్రేక్షకుల ముందుకు రానుంది. వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక కీలక పాత్రలో నటిస్తోంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడడంతో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నేడు ఘనంగా నిర్వహించనున్నారు.
ఇక ఈ ఈవెంట్ కు ప్రభాస్ గెస్ట్ గా రానున్నాడు. దీంతో అభిమానులు ఎంట్రీ పాస్ ల కోసం కొట్టుకొంటున్నారు. ఎలాగైనా ప్రభాస్ ఈవెంట్ కు వెళ్లాలని తహతహలాడుతున్నారు. కాగా తాజాగా అభిమానుల ఆశలపై మేకర్స్ నీళ్లు చల్లారు. ప్రభాస్ ఈవెంట్ కు గెస్ట్ గా వస్తున్నాడు కానీ ఈ ఈవెంట్ ను అభిమానులెవరిని అనుమతించడం లేదని తెలుస్తోంది. అంటే మీడియా వరకే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆహ్వానితులు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ఇటీవల బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఒక అభిమాని మృతి చెందిన విషయం తెల్సిందే. ఆ ఘటనను దృష్టిలో పెట్టుకొని మేకర్స్ అభిమానులకు ఆహ్వానాన్ని పంపలేదని తెలుస్తోంది. ఇక ఈ వార్త ఖచ్చితంగా ప్రభాస్ ఫ్యాన్స్ కు చేదువార్తే.. తమ అభిమాన హీరో కోసం ఈవెంట్ కు రావాలనుకున్నవారు ఈ వార్త విని నిరాశ పడుతున్నారు. అందరి లానే ప్రభాస్ ను టీవీలో చూడాల్సిందే అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇక నేటి సాయంత్రం 7 గంటలకు మీడియా సమక్షంలో సీతారామం ప్రై రిలీజ్ ఈవెంట్ జరగనుంది. మరి ఈ ఈవెంట్ లోనైనా ప్రభాస్ తన మొహమాటాన్ని పక్కన పెట్టి మాట్లాడతాడేమో చూడాలి.