మే 12న రిలీజ్ అయిన సర్కారు వారి పాట.. 12 రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 200 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసి.. సమ్మర్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇక ఈ సినిమా విడుదలై రెండు వారాలు పూర్తి చేసుకుంది. దాంతో సర్కారు వారి పాట ఓటిటి రిలీజ్ డేట్ ఇదేనంటూ.. సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది. మరి సర్కారు వారి పాట.. ఓటిటి డేట్ నిజంగానే లాక్ అయిందా..?
స్పైడర్ వంటి భారీ ఫ్లాప్ తర్వాత.. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు.. సినిమాలతో హ్యాట్రిక్ హిట్ అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇక రీసెంట్‌గా వచ్చిన సర్కారు వారి పాట చిత్రంతో వరుసగా నాలుగో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. సోషల్ మెసేజ్‌తో పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా.. దర్శకుడు పరశురామ్ తెరకెక్కించిన ఈ చిత్రం.. రికార్డు స్థాయిలో వసూళ్లను రాబట్టింది. ఎప్పుడో బ్రేక్ ఈవెన్ అయిన ఈ సినిమా.. రెండు వారాలు పూర్తి చేసుకొని మూడు వారంలోకి అడుగుపెట్టింది. అయినా ఇంకా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే రాబడుతోంది. అయితే ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తున్న ఈ సినిమా.. ఇప్పుడు ఓటిటి ఎంట్రీకి కూడా రెడీ అవుతోందని తెలుస్తోంది. ఈ మధ్య పెద్ద సినిమాలైతే నెల రోజులకు అటు, ఇటుగా ఓటిటిలోకి వస్తుండగా.. చిన్న సినిమాలైతే రెండు, మూడు వారాల్లోనే వచ్చేస్తున్నాయి. ఇక ఇప్పుడు సర్కారు వారి పాట కూడా అలాగే ఓటిటి ఎంట్రీ ఇవ్వబోతోందని టాక్. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను.. ప్రముఖ ఓటిటి సంస్థ అమెజాన్ ప్రైమ్ భారీ రేటుకి దక్కించుకుంది. ఓటిటి ఒప్పందం ప్రకారం నెలలోపే స్ట్రీమింగ్‌కు రానుందని తెలుస్తోంది. ఆ లెక్కన జూన్ 10న సర్కారు వారి పాట డిజిటల్ ఎంట్రీ ఇవ్వనుందని టాక్. లేదంటే 40 రోజుల తర్వాత.. అంటే జూన్ 24న ఓటిటిలోకి రాబోతోందని తెలుస్తోంది. ఇంకా ఈ విషయంలో క్లారిటీ రాకపోయినా.. ఈ రెండు తేదిల్లోనే సర్కారు వారి పాట ఓటిటిలోకి రావడం పక్కా అంటున్నారు.