Sarkaaru Noukari Trailer: సింగర్ సునీత కొడుకు ఆకాష్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం సర్కారు నౌకరి. శేఖర్ గంగనమోని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని RK టెలిషో ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పై దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో ఆకాష్ సరసన భావన అనే కొత్త అమ్మాయి నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ ఆద్యంతం ఆకట్టుకుంటుంది. సునీత కొడుకు మొదటి సినిమా అయినా కూడా తడబడకుండా నటించినట్లు తెలుస్తోంది. ఒక మారుమూల పల్లెటూరు లో ఈ కథ నడుస్తుంది అని కనిపిస్తుంది.
గోపాల్.. సర్కార్ మండల ఆఫీస్ లో పని చేస్తాడు. కొత్తగా పెళ్లి కావడంతో భార్యను తీసుకొని మహబూబ్ నగర్ లోని కొల్లాపూర్ గ్రామానికి వెళ్తాడు. అక్కడ అందరూ చదువుకొని గ్రామస్తులే.. వారికి ఏమి తెలియదు. ఇక ఆ ప్రజల జీవన విధానం చూసిన గోపాల్ కు వారిని మార్చాలి అని అనిపిస్తుంది. పిల్లలను కనడం.. సరిగ్గా పెంచకపోవడం.. చదివించలేకపోవడానికి కారణం.. వారికి కండోమ్స్ వాడకం గురించి తెలియకపోవడమే అని తెలుసుకొని.. ప్రజలకు కండోమ్స్ పంచుతూ ఉంటాడు. అసలు అవేంటో కూడా తెలియని ప్రజలు వాటిని బుగ్గలు అనుకోని వాటితో ఆడుకుంటూ ఉంటారు. ఇక వాటి గురించి తెలుసుకొని.. గోపాల్ ను ప్రజలు అసహ్యించుకుంటారు. చివరికి భార్య కూడా .. ఆ నౌకరి కావాలా.. ? నేను కావాలా ? అని తేల్చుకోమనడం చూపించారు. ఇక చివర్లో సర్కారు నౌకరి అంటే జీతం తీసుకోవడం కాదు.. ప్రజలకు సేవ చేయడం అని హీరో చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటుంది. సినిమాలో చాలా సున్నితమైన విషయాన్నీ ఎంతో అద్భుతంగా చూపించినట్లు తెలుస్తోంది. ఇక శాండిల్య పిసాపతి మ్యూజిక్ ఫ్రెష్ గా అనిపిస్తుంది. మొత్తానికి ట్రైలర్ తోనే సినిమాపై హిప్ తెచ్చారు. ఇకపోతే ఈ సినిమా జనవరి 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో సునీత కొడుకు ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.