అనారోగ్యం నుంచి కాస్త కోలుకోని శాకుంతలం సినిమా ప్రమోషన్స్ ని వచ్చిన లేడీ సూపర్ స్టార్ సమంతా, తాజాగా #CITADEL వెబ్ సిరీస్ షూటింగ్ లో జాయిన్ అయ్యింది. అమెజాన్ ప్రైమ్ లో టెలికాస్ట్ కానున్న ఈ సీరీస్ ని రాజ్ అండ్ డీకే డైరెక్ట్ చేస్తున్నారు. ఇటివలే సమంతకి #CITADEL షూటింగ్ లో యాక్షన్ సీక్వెన్స్ చేస్తూ గాయలపాలయ్యింది. ఈ వెబ్ సీరీస్ షూటింగ్ బ్రేక్ వస్తుండడంతో సమంతా… విజయ్ దేవరకొండతో నటిస్తున్న ‘ఖుషి’ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ‘ఖుషి’ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ప్యూర్ లవ్ స్టొరీ.
Read Also: Sreeleela: చిన్నా లేదు.. పెద్దా లేదు.. అందరి కన్ను పాప మీదే..?
ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఖుషీ మూవీకి సమంతా డేట్స్ అడ్జస్ట్ చెయ్యట్లేదు అనే రూమర్ స్ప్రెడ్ అయ్యాయి. దీంతో స్వయంగా సమంతా అండ్ టీం బయటకి వచ్చి… సామ్ ఖుషీ సినిమా నుంచి తప్పుకోలేదు అనే క్లారిటీ ఇచ్చారు. అయితే ఖుషీ సినిమా గురించి తాజాగా బయటకి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సామ్ మార్చ్ 8 నుంచి ఖుషీ మూవీ సెట్స్ లో జాయిన్ అవ్వనుంది. విజయ్ దేవరకొండ, సమంతల మధ్య సీన్స్ ని తెరకెక్కించడానికి శివ నిర్వాణ రెడీ అవుతున్నాడు. ఇకపై బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ కంప్లీట్ చేసి జూన్ నెలలో ఖుషీ సినిమాని రిలీజ్ చెయ్యాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి లైగర్ సినిమాతో పాన్ ఇండియా డిజప్పాయింట్మెంట్ ఇచ్చిన విజయ్ దేవరకొండ, టక్ జగదీశ్ సినిమాతో ఫ్లాప్ ఇచ్చిన శివ నిర్వాణ, తెలుగు సినిమాలని తగ్గించిన సమంతా ఒక ఫీల్ గుడ్ ప్రేమ కథతో కలిసి పాన్ ఇండియా హిట్ కొడతారేమో చూడాలి.