Samantha: ఈ కాలంలో ఎప్పుడు ఎవరు ప్రేమలో పడతారో.. ఎన్నిరోజులు కలిసి ఉంటారో.. ఎందుకు విడిపోతారో చెప్పడం చాలా కష్టం. ఇక స్టార్ల పెళ్లిళ్ల గురించి, విడాకుల గురించి, బ్రేకప్ ల గురించి చెప్పనవసరం లేదు. ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరు ఒకరి ఇష్టాలు ఒకరిని గౌరవిస్తామని, ఒకరి పేర్లు ఇంకొకరు టాటూలు వేయించుకొని ఆతరువాత బ్రేకప్ అయ్యాకానో, విడాకులు తీసుకున్నాకనో ఆ టాటూలు చెరగని గుర్తులుగా మిగిలిపోతుంటాయి. సమంత ప్రస్తుతం అదే పరిస్థితిని ఎదుర్కొంటుందా..? అంటే నిజమే అంటున్నారు అభిమానులు. నాగ చైతన్యతో వివాహమయ్యాక సామ్ చై పేరును రొమ్ము భాగానికి దిగువన పక్కటెముకలకు పై భాగంలో వేయించుకున్న విషయం తెలిసిందే.
Chiranjeevi: మేనల్లుడు హిట్.. మామయ్య దిల్ ఖుష్
సమంత శరీరం పై మూడు పచ్చబొట్లు ఉంటాయి. ఒకటి చేతి మణికట్టు వద్ద రెండు బాణాల రూపంలో మ్యాచింగ్ టాటూ ఉంటుంది. అది చై చేతిమీద కూడా ఉంటుంది. ఇక రెండోది.. సామ్ మెడ కింద ymc(ఏ మాయ చేసావే) అని రాసి ఉంటుంది. మూడోది చై పేరు. మూడు టాటూలు చై కు సంబంధించినవే కావడం విశేషం. ఎంత ప్రేమగా వేయించుకుందో.. ఇప్పుడు అదే ప్రేమను తలుచుకొని బాధపడుతుంది. ఒక ఇంటర్వ్యూలో టాటూ వేయించుకోవచ్చా అంటే.. అస్సలు వద్దు.. దానివలన ఎంతబాధ ఉంటుందో చెప్పకనే చెప్పింది సామ్. ఇక ఈ టాటూ కథ ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే .. తాజాగా చై పేరు.. సామ్ ఒంటిపై మరోసారి దర్శనమిచ్చింది. తాజాగా సిటడెల్ లండన్ ప్రీమియర్ ఈవెంట్‌లో పాల్గొన్న సామ్.. అక్కడ దిగిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ లో చై పేరు స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో మరోసారి ఈ టాటూ హాట్ టాపిక్ గా మారింది. ఏదిఏమైనా.. కొన్ని గుర్తులు చెరపలేం.. ఈ టాటూ కూడా అంతే సామ్.. అంటూ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు.