Sakshi Dhoni says she is allu arjun fan: మహేంద్ర సింగ్ ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారన్న సంగతి తెలిసిందే. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై LGM సినిమాను రూపొందించగా ఆ సినిమా తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. హరీష్ కళ్యాణ్, ఇవానా, నదియా, యోగిబాబు కీలక పాత్రల్లో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని రమేష్ తమిళ్ మణి దర్శకత్వం వహించటంతో పాటు సంగీతాన్ని కూడా అందిస్తున్నారు. ధోని ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సాక్షి ధోని, వికాస్ హస్జా నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబందించిన తెలుగు ట్రైలర్‌ను మేకర్స్ కొద్దిరోజుల క్రితమే రిలీజ్ చేశారు. త్వరలో రిలీజవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు హైదరాబాద్ లో సినిమా యూనిట్ సమావేశం నిర్వహించింది. ఈ క్రమంలో పాల్గొన్న సాక్షి ధోని కీలకమైన వ్యాఖ్యలు చేశారు.
Kushi Title Song: ఖుషి టైటిల్ సాంగ్ వచ్చేస్తోంది!
ప్రెస్ మీట్ లో సాక్షి ధోనిమాట్లాడుతూ నేను అల్లు అర్జున్ ఫ్యాన్, అల్లు అర్జున్ నటించిన అన్ని సినిమాలు చూశానని ఆమె పేర్కొన్నారు. ఇక ఇది విన్న బన్నీ ఫాన్స్ అయితే కాలర్ ఎగరేస్తున్నారు. ఇదిరా మా బన్నీ రేంజ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇండియా మొత్తం ప్రేమించే ధోనీ భార్య మా హీరోను అభిమానిస్తున్నారు అని అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక LGM సినిమా విషయానికి వస్తే ఇప్పటి వరకు మన సినిమాల్లో రానటువంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్‌తో LGM తెరకెక్కుతుందని ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ సినిమాలో హీరో హరీష్ కళ్యాణ్, హీరోయిన్ ఇవానాతో పాటు హీరో తల్లిగా నటించిన నదియా చాలా కీలక పాత్రలలో అలరించనున్నారు.