Kushi film title song is releasing on July 28th: డాషింగ్ హీరో ది విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటిస్తున్న పాన్ ఇండియన్ చిత్రం ఖుషి మీద భారీ అంచనాలు ఉన్నాయి. శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా సెప్టెంబర్ 1న ఈ చిత్రం విడుదల కాబోతోంది. రీసెంట్‌గానే మేకర్లు షూటింగ్ పూర్తి చేసి.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా ప్రారంభించారు. ఖుషి సినిమా నుంచి ఇప్పటికే విడుదల చేసిన నా రోజా నువ్వే, ఆరాధ్య సాంగ్స్ సోషల్ మీడియాలో చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. ఈ క్రమంలోనే ఇప్పటికీ యూట్యూబ్ షార్ట్స్, ఇన్ స్టాగ్రాం రీల్స్‌లో ట్రెండ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఖుషి నుంచి మూడో పాట కూడా మన ముందుకు రానుంది. ఖుషి అంటూ సాగే ఈ పాటను జూలై 28న రిలీజ్ చేయనున్నారని అధికారికంగా ప్రకటించారు.
Cinema: సినిమాటోగ్రఫర్- డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ మధ్య తేడా ఏంటో తెలుసా?
ఇక ఈ టైటిల్ సాంగ్ అప్డేట్ ఇస్తూ రిలీజ్ చేసిన పోస్టర్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. ప్రేమలో మునిగినట్టు గాల్లో తేలిపోతోన్నట్టుగా విజయ్ దేవరకొండ పోస్టర్ ఎంతో కూల్‌గా ఉంది. ఇక ఖుషి టైటిల్ సాంగ్ కోసం ఆయన అభిమానులు, కామన్ ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 1న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు. విజయ్ దేవరకొండ, సమంత హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలలో జయరాం, సచిన్ ఖేడేకర్, మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, శరణ్య పొన్ వణ్నన్, రోహిణి, వెన్నెల కిషోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు ఇతర కీలక పాత్రలలో నటిస్తున్నారు.