ప్రస్తుతం సినిమాల విషయంలో దర్శక నిర్మాతలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతకుముందులా ఎలా చేసినా, ఏం చేసినా చూసే ప్రేక్షకులు కారు ఇప్పుడు.. వారిలో కూడా మార్పు వచ్చింది. కథను బట్టి సినిమా చూస్తున్నారు కానీ స్టార్ హీరోనా, చిన్న హీరోనా, వేరే లాంగ్వేజా ఇలాంటివేమీ పట్టించుకోవడం లేదు. ఇక దీంతో నిర్మాతలు తమ సినిమాలో ప్రేక్షకులకు నచ్చే ఎలిమెంట్స్ ను గుప్పించేస్తున్నారు. యాక్షన్ సీక్వెన్స్, ఐటెం సాంగ్స్.. అందులోనూ ఐటెం సాంగ్స్ అంటే ఖచ్చితంగా స్టార్ హీరోయిన్ ఉండాలని చెప్పేస్తున్నారు. ఎందుకంటే వారి వలన కూడా మార్కెటింగ్ పెంచుకొనే అవకాశం ఉంటుంది కాబట్టి. మొన్నటికి మొన్న పుష్ప చిత్రంలో సమంత చేసిన ఐటెం సాంగ్ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమ్మడి డాన్స్ మూమెంట్స్, కైపు ఎక్కించే చూపులు.. మెస్మైరైజ్ చేసే డ్రెస్ లతో కుర్రకారును అలరించింది. ఈ ఒక్క పాట సమంత రేంజ్ ఇంకా ఎక్కువ పెరిగేలా చేసింది. దీంతో ప్రస్తుతం స్టార్ హీరోయినులు ఐటెం సాంగ్స్ కి సై అంటున్నారు. అభిమానులు కూడా తమకిష్టమైన హీరోయిన్ కూడా ఐటెం సాంగ్స్ చేయాలనీ కోరుకుంటున్నారు.
ఇక స్వతహాగా డాన్సర్ అయినా సాయి పల్లవి కూడా ఐటెం సాంగ్స్ చేస్తే చూడాలని చాలామంది కోరుకుంటున్నారు. తాజాగా ఈ విషయాన్నీ సాయి పల్లవి ముందు ఉంచితే ఆమె షాకింగ్ సమాధానం చెప్పడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. మొదటి నుంచి స్కిన్ షోలకు దూరంగా ఉంటానని చెప్పుకొచ్చిన ఆమె ఐటెం సాంగ్స్ కూడా దూరమేనని తేల్చి చెప్పింది. కంఫర్ట్ లేని డ్రెస్ లు వేసుకొని కంఫర్ట్ లేని డాన్స్ మూమెంట్స్ ను చేయలేనని చెప్పుకొచ్చింది. తనకు ఐటెం సాంగ్స్ సెట్ కావని, అస్సలు తనకు ఐటెం సాంగ్స్ చేయాలన్న ఆసక్తి కూడా లేదని చెప్పుకొచ్చింది. ఐటెం సాంగ్స్ మాత్రమే కాకుండా తాను ఇబ్బంది పడే ఏ పనిని చేయనని, స్పెషల్ సాంగ్ లో కూడా కనిపించాలనుకోవడం లేదని తెలిపింది. దీంతో ప్రస్తుతం సాయి పల్లవి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ప్రస్తుతం ప్రతి ఒక్క హీరోయిన్ తనను తాము నిరూపించుకోవడానికి స్పెషల్ సాంగ్స్ లో నటించాలని ఉవిళ్లూరుతుంటే సాయి పల్లవి ఇలా మాట్లాడడం కొంతమందికి షాకింగ్ కు గురి చేస్తున్నాయి. ఇకపోతే సాయి పల్లవి కెరీర్ విషయానికొస్తే ఆమె నటించిన ‘విరాట పర్వం’ విడుదలకు సిద్ధమవుతుండగా.. ‘గార్గి’ షూటింగ్ జరుపుకొంటుంది.