RRR: మన టాలీవుడ్ ను దేశ వ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ చేయడానికి ఆర్ఆర్ఆర్ త్రయం గట్టిగా కష్టపడుతోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఆర్ఆర్ఆర్. 2మార్చి 5 న రిలీజ్ అయిన ఈ సినిమా దేశ వ్యాప్తంగా రూ. 1200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండస్ట్రీని షేక్ చేసింది. ఇక ఇప్పుడు జపాన్ లో రికార్డు సృష్టించడానికి రెడీ అయ్యింది. అక్టోబర్ 21 న ఈ సినిమా జపాన్ లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలోనే ఆర్ఆర్ఆర్ త్రయం ప్రమోషన్స్ తో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక ఈ ప్రమోషన్స్ లో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా మారారు ఆర్ఆర్ఆర్ త్రయం భార్యలు.. జపాన్ కు ఈ ముగ్గురు ఒక్కరే వెళ్ళలేదు వెంట భార్యలను కూడా తీసుకెళ్లారు. ఎన్టీఆర్ భార్య ప్రణతి, చరణ్ భార్య ఉపాసన, రాజమౌళి భార్య రమా జపాన్ లో సందడి చేసారు.
ఇప్పటివరకు ఆర్ఆర్ఆర్ త్రయాన్ని మాత్రమే కలిసి చూసాం.. కానీ ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్ గా ఈ ఆర్ఆర్ఆర్ త్రయం భార్యలను కలిసి చూడడం మొదటిసారి. ఈ ఫోటోలను ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ టుగెదర్ అని క్యాప్షన్ పెట్టుకొచ్చింది. ఇక చరణ్ అయితే ఏకంగా వీడియో కూడా పెట్టేశాడు. జపాన్ వీధుల్లో భార్యలతో చేయి చేయి పట్టుకొని నడుస్తున్న వీడియోను షేర్ చేశాడు. ఈ వీడియోలో రాజమౌళి కొడుకు కార్తికేయ, అతని భార్య కూడా కనిపించి కనువిందు చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఇంకెందుకు ఆలస్యం జపాన్ లో భార్యలతో ‘ఆర్ఆర్ఆర్’ త్రయం ఎలా ఎంజాయ్ చేశారో మీరు కూడా చూడండి.
Together forever ❤️!! #rrr pic.twitter.com/1jBbzacwkk
— Ram Charan (@AlwaysRamCharan) October 21, 2022