టాలీవుడ్ హీరో నితిన్ ఒక మంచి హిట్ కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాడు. అతని మూవీస్‌పై మార్కెట్ క్రేజ్ స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ, ఇటీవల కాలంలో ఫలితాల పరంగా నిరాశలే ఎదురయ్యాయి. దీంతో ఇప్పుడు ఎంతో నమ్మకంతో ‘రాబిన్ హుడ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా, వెన్నెల కిషోర్, రాజేంద్రపస్రాద్, దేవదత్త నాగె, టామ్ చాకో, శుభలేఖ సుధాకర్, బ్రహ్మాజీ లు కీలక పాత్రలు పోషించారు. ఎన్నో అంచనాల నడుమ మార్చి 28న అంటే నిన్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, మంచి టాక్‌తో ధూసుకెలుతుంది. అయితే ఈమూవీలో ‘అదిదా సర్ప్రైజు’ పాట ఎంత హిట్ అయిందో తెలిసిందే. కానీ ఈ పాటలో కేతిక శర్మతో వేయించిన హుక్ స్టెప్ మీద పెద్ద వివాదమే నడిచింది. ఈ వ్యవహారంపై మహిళా కమిషన్ స్పందించి.. మహిళలతో వల్గర్ స్టెప్స్ వేయిస్తే చర్యలు తప్పవని వార్నింగ్ కూడా ఇచ్చింది. దీంతో
Also Read: Vikram : ప్రేక్షకులకు క్షమాపన చెప్పిన ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ నిర్మాత
‘అదిదా సర్ప్రైజు’ పాట చూసిన వాళ్లకు ధియెటర్‌లో నిజంగానే సర్ప్రైజ్ ఎదురైంది. వివాదాస్పదం అయిన హుక్ స్టెప్ సినిమాలో కనిపించలేదు. తెలివిగా కేతిక క్లోజప్ కనిపించేలా ఫ్రేమ్‌ను ఎడిట్ చేసి హుక్ స్టెప్ సినిమాలో కనిపించకుండా జాగ్రత్త పడింది టీం. ఇక ఈ స్టెప్ స్క్రీన్ మీద లేకపోయేసరికి యువ ప్రేక్షకులు మాత్రం ఒకింత నిరాశపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ పాట స్టెప్స్‌కు సంబంధించి కరెక్షన్లు జరుగుతున్నట్లుగా టీం వర్గాలు హింట్ ఇచ్చాయి. మూవీ టీం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రేక్షకులు అభినందిస్తున్నారు.