తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ నటించిన తాజా చిత్రం ‘వీర ధీర సూరన్: పార్ట్ 2’. ప్రముఖ నిర్మాణ సంస్థ హెచ్ఆర్ పిక్చర్స్ బ్యానర్‌పై రియా షిబు నిర్మించిన ఈ సినిమాకు ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించగా, దుషారా విజయన్, సిద్దిఖీ, ఎస్‌జే సూర్య, సూరజ్ వెంజరమూడు తదితరులు నటించారు. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించిన ఈ మూవీ, ఎన్నో అంచనాల నడుమ మార్చి 27న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. కానీ రిలీజ్ డే రోజు విడుదలవ్వాల్సి ఈ చిత్రం ఉదయం ఆటలు, పలు సమస్యల కారణంగా క్యాన్సిల్ అయ్యి.. ఎట్టకేలకు సాయంత్రానికి విడుదలయ్యాయి. దీంతో అభిమానులు చాలా నిరాశ చెందారు. అయితే తాజాగా ఈ విషయంపై నిర్మాత శిబు మాట్లాడుతూ.. క్షమపణలు తెలిపారు.
Also Read : Samantha : ఆ కోరికను.. దేవుడు ఇప్పుడు తీర్చాడు
‘ ‘వీర ధీర శూరన్ పార్ట్ 2’ విడుదల విషయంలో జాప్యం జరిగినందుకు క్షమాపణలు కోరుతున్నాను. ఆర్థిక సమస్యల కారణంగా ఆలస్యం జరిగింది అని సృష్టిస్తోన్న రూమర్లపై క్లారిటీ ఇవ్వడానికి ఈ పోస్ట్ పెడుతున్నాను. అర్థం లేని రూమర్స్ సృష్టించొద్దు. థియేటర్లో విడుదలవడానికి ముందు ఓటీటీ రైట్ హోల్డర్లు వారి హక్కులను సరైన సమయంలో అమ్మలేకపోయాను.. వారి పెట్టుబడులను రక్షించడం కోసం.. చివరి నిమిషంలో సినిమా విడుదలను ఆపాల్సి వచ్చింది. అనంతరం వారితో చర్చించి షోలు ప్రారంభించాం. ఈ సినిమాను సపోర్ట్ చేస్తున్న వారందరికీ ధన్యవాదాలు’ అని తెలిపారు.