Ritika Nayak : టాలీవుడ్ కు మరో కొత్త హీరోయిన్ వచ్చేసింది. ఆమె వరుసగా హిట్ సినిమాలు చేస్తుండటంతో ఆల్రెడీ ఫామ్ లో ఉన్న హీరోయిన్లకు టెన్షన్ పుడుతోంది. ఆమె ఎవరో కాదు రితిక నాయక్. మోడల్ గా కెరీర్ స్టార్ట్ చేసిన ఈ బ్యూటీ.. తెలుగులో ఇప్పుడు వరుస సినిమాల్లో నటిస్తోంది. విశ్వక్ సేన్ హీరోగా వచ్చిన అశోకవనంలో అర్జున కల్యాణం మూవీలో హీరోయిన్ గా చేసింది. ఆ మూవీతో మంచి హిట్ అందుకుంది. దాని తర్వాత నాని హీరోగా వచ్చిన హాయ్ నాన్న మూవీలో కీలక పాత్ర చేసింది. ఇప్పుడు కెరీర్ టర్నింగ్ సినిమా చేస్తోంది. తేజ సజ్జ హీరోగా వస్తున్న మిరాయ్ మూవీలో హీరోయిన్ గా రాబోతోంది.
Read Also : Pawan Kalyan : మొన్న విజయ్.. నేడు బాలయ్య.. పవన్ కు పోటీనే లేదా..?
ఈ మూవీపై ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో తెలిసిందే. హిట్ గ్యారెంటీ సినిమాగా రాబోతోంది. ఇందులో హీరోయిన్ పాత్ర చాలా కీలకంగా కనిపిస్తోంది. ఈ మూవీ గనక హిట్ అయితే రితికకు అవకాశాల వరద పారడం ఖాయం. దీంతో హిట్లు లేక ఇబ్బందులు పడుతున్న శ్రీలీల, మీనాక్షి ప్లేస్ ను ఈ బ్యూటీ రీప్లేస్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందం, అభినయం రెండూ ఈ బ్యూటీ సొంతం. పైగా ఎలాంటి గ్లామర్ పాత్రలు చేయడానికైనా.. నటనకు స్కోప్ ఉండే పాత్రలు చేయడానికైనా ఈమె బాగా సూట్ అవుతోంది. మిరాయ్ హిట్ అయితే టాలీవుడ్ స్టార్ హీరోయిన్ల లిస్టులోకి ఆమె చేరిపోవడం ఖాయం అంటున్నారు.
Read Also : Prabhas vs Raviteja : రంగంలోకి ప్రభాస్.. రవితేజ తప్పుకుంటాడా..?