Pawan Kalyan : అంతా అనుకున్నట్టే జరిగింది. సెప్టెంబర్ 25 నుంచి బాలకృష్ణ అఖండ-2 తప్పుకుంది. మూవీని వాయిదా వేస్తున్నట్టు టీమ్ ప్రకటించింది. సెప్టెంబర్ 25న పవన్ కల్యాణ్ హీరోగా సుజీత డైరెక్షన్ లో వస్తున్న ఓజీ మూవీ రిలీజ్ అవుతోంది. బాలయ్య, పవన్ సినిమాల మధ్య భీకర పోటీ ఉంటుందని అంతా అనుకున్నారు. కానీ బాలయ్య పోటీ నుంచి తప్పుకున్నారు. రీ రికార్డింగ్, వీఎఫ్ ఎక్స్ పెండింగ్ పనుల వల్ల వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే మొన్న విజయ్ దేవరకొండ కూడా తన సినిమాను వాయిదా వేసుకున్నాడు. పవన్ హరిహర వీరమల్లు సినిమా కోసం కింగ్ డమ్ సినిమాను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు బాలయ్య కూడా అదే బాటలో వెళ్తున్నాడు.
Read Also : Prabhas vs Raviteja : రంగంలోకి ప్రభాస్.. రవితేజ తప్పుకుంటాడా..?
అప్పుడు హరిహర వీరమల్లుకు పోటీ లేకుండానే రిలీజ్ అయింది. రిజల్ట్ పక్కన పెడితే.. ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి. ఇప్పుడు ఓజీ మూవీకి అఖండ-2 పోటీ వస్తే కథ వేరేలా ఉండేది. వార్ వన్ సైడ్ అయింది కాబట్టి ఓజీ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ టాక్ బాగుంటే కలెక్షన్లు భారీగా ఊహించవచ్చు. అఖండ-2 పోటీలో ఉంటే ఓజీకి టాక్ బాగున్నా కలెక్షన్ల మీద ఎఫెక్ట్ పడేది. అప్పుడు కింగ్ డమ్, ఇప్పుడు అఖండ-2 తప్పుకోవడంతో పవన్ కల్యాణ్ సినిమాలకు పోటీనే లేకుండా పోతోందనే టాక్ నడుస్తోంది. మరి ఈ అవకాశాన్ని ఓజీ ఏ స్థాయిలో వాడుకుంటాడో చూడాలి.
Read Also : Manchu Manoj : స్టార్ హీరోయిన్ కు మనోజ్ క్షమాపణలు.. ఎందుకంటే..?