రామ్ గోపాల్ వర్మ.. ఈ మధ్య సినిమాల కన్నా ట్వీట్లపై బాగా ఫోకస్ పెట్టి వివాదాలను సృష్టిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. మొన్నటివరకు ఏపీ టిక్కెట్ ఇష్యూ అన్నాడు. నిన్నటికి నిన్న మెగా, అల్లు వారి ఫ్యామిలీ అని, పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ ని పాన్ ఇండియా చేయాలి అని ట్వీట్స్ చేసి రచ్చ లేపాడు. ఇక తాజాగా వారందరిని వదిలేసి తన మీద తానే కౌంటర్లు వేసుకోవడం మొదలుపెట్టాడు. ఎప్పుడు లేనిది వర్మ తన బాల్యం గురించి రాసుకొచ్చాడు. చిన్నతనంలో వర్మ ఎలా ఆలోచించేవాడు అనేది ఆయన మాటల్లోనే చెప్పుకొచ్చాడు.
“పెద్దలు మాత్రమే పిల్లలను చిన్నపిల్లలుగా భావిస్తారు .. కానీ ఏ పిల్లలు తమను తాము చిన్నపిల్లలు గా భావించరు ..నేను చిన్నతనంలో, పెద్దలందరూ మూర్ఖులని భావించాను. అందుకే నేనెప్పుడూ పెద్దవాడిగా అవ్వాలని కోరుకోలేదు” అంటూ చెప్పుకొచ్చాడు. నిజానికి వర్మ చెప్పిన దాంట్లో కూడా నిజం లేకపోలేదు. ఈ పిల్లలు తమను తాము చిన్నపిల్లలు అంటే ఊరుకోరు. కానీ, పెద్దవారిగా అవ్వడం మాత్రం తప్పదు అది సృష్టి ధర్మం కదా అని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. ఏదిఏమైనా వర్మ ట్వీట్స్ సంచలనం సృష్టించడం సాధారణమే. ప్రస్తుతం ఈ ట్వీట్ కూడా నెట్టింట వైరల్ గా మారింది.
Only an adult thinks a child is a child …But no child thinks he or she is a child ..When I was a child, I realised that all adults are idiots and ever since I refused to grow up 💪
— Ram Gopal Varma (@RGVzoomin) February 8, 2022