రెబల్ స్టార్ ప్రభాస్, దర్శకుడు నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో “ప్రాజెక్ట్ కే” అనే భారీ బడ్జెట్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. 400 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ గురుపౌర్ణమి సందర్భంగా ప్రారంభమైంది. నాగ్ అశ్విన్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ తో 10 రోజుల షెడ్యూల్ పూర్తి చేసారు. ఈ సినిమా కోసం ప్రభాస్ దాదాపు 200 రోజులు డేట్స్ కేటాయించినట్టు వార్తలు వచ్చాయి. తాజా సమాచారం ప్రకారం “ప్రాజెక్ట్ కే” రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రభాస్ “సలార్” చిత్రీకరణ చివరి దశలో ఉంది. మరోవైపు “ఆదిపురుష్” కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ రెండు సినిమాలనూ పూర్తి చేసి నవంబర్ లో “ప్రాజెక్ట్ కే” రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొనబోతున్నారు ప్రభాస్.
Read Also : క్యాన్సర్‌తో పోరాడుతున్న అభిమానికి ప్రభాస్ సర్ప్రైజ్
నవంబర్ లో ప్రారంభం కానున్న ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది మొత్తం జరగనుంది. దాదాపు 12-13 నెలల పాటు ఈ సినిమా షూటింగ్ జరపడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ లో 2021 నవంబర్ నుంచి నటీనటులంతా పాల్గొననున్నారు. ఈ ప్రాజెక్ట్ నాగ్ కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. విఎఫ్ఎక్స్ పని కూడా ఇప్పటికే ప్రారంభమైంది. అమితాబ్ బచ్చన్ కీలకపాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ నిర్మిస్తుండగా, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. డాని శాంచెజ్-లోపెజ్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.