Eagle Ticket Rates : రవితేజ హీరోగా ఈగల్ అనే సినిమా సంక్రాంతికి రిలీజ్ అవ్వాల్సి ఉంది. కానీ థియేటర్ల సర్దుబాటు వ్యవహారంలో ఫిలిం ఛాంబర్ సలహాతో వెనక్కి తగ్గింది. ఈ ఫిబ్రవరి 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈగల్ మీద ముందు నుంచి ప్రేక్షకులలో అంచనాలు ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టు టీజర్, ట్రైలర్ అంచనాలను మరింత పెంచింది దానికి తోడు ఫిలిం ఛాంబర్ మాటకు గౌరవం ఇస్తూ వెనక్కి తగ్గడంతో ఈ సినిమా మీద ప్రేక్షకులలో మంచి పాజిటివ్ బజ్ కూడా ఏర్పడింది. ఇక ఈ సినిమాకి పోటీగా తమిళ డబ్బింగ్ సినిమా లాల్ సలాం రిలీజ్ అవుతుంది. కానీ ఎందుకో ఇప్పటివరకు ఆ సినిమా సరైన సౌండ్ చేసినట్లు అనిపించడం లేదు. ఒకరకంగా చెప్పాలంటే అందరి దృష్టి రవితేజ ఈగల్ మీదనే కేంద్రీకృతం అయి ఉంది. ఫైనల్ కాపీ రెడీ అవ్వడంతో రవితేజ సినిమా యూనిట్ తో కలిసి సినిమా చూసి తాను సాటిస్ఫై అయ్యాను అంటూ ఒక వీడియో రిలీజ్ చేయడంతో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అభిమానులైతే భావిస్తున్నారు. అయితే ఇప్పుడు ఈగల్ సినిమాకి ప్రేక్షకులను రప్పించడం లక్ష్యంగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది.
Lok Sabha: పీఎం కిసాన్ పెంపుపై కేంద్రం క్లారిటీ ఇచ్చేసింది!
అదేమిటంటే ఈ సినిమాకి టికెట్ రేట్లు పెంచి అమ్మడం లేదని తెలుస్తోంది. సాధారణంగా ప్రభుత్వం ఫిక్స్ చేసిన రేట్లకి ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. అంటే హైదరాబాద్ పీవీఆర్ – ఐనాక్స్ మల్టీప్లెక్స్ స్క్రీన్లలో ‘ఈగల్’ టికెట్ రేటు రూ. 200 మాత్రమే ఉండనుంది, ఇక ఏషియన్ మల్టీప్లెక్స్‌లలో కొన్ని చోట్ల 175 రూపాయలే. సింగిల్ స్క్రీన్లలో టికెట్ రేటు విషయానికి వస్తే బాల్కనీ రేటు రూ. 150 మాత్రమే కాగా స్క్రీన్ ముందు ఉండే నేల టికెట్ రేటు 50 రూపాయలుగా ఉండనుంది ఇక మరోపక్క ఏపీలోనూ ‘ఈగల్’ టికెట్ రేట్లు పెంచలేదు. మెజారిటీ సింగిల్ స్క్రీన్లలో రూ. 110 మాత్రమే ఉండగా కొన్ని థియేటర్లలో 145 రూపాయలు పెట్టారు. ఇక ఈ ‘ఈగల్’ సినిమాను కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేయగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు. ఇంతకు ముందు రవితేజతో ఆయన ‘ధమాకా’ తీయగా ఆ సినిమా భారీ వసూళ్లు సాధించింది. అదే సీన్ మళ్ళీ రిపీట్ అవుతుందని సినిమా యూనిట్ నమ్మకంగా ఉంది.