RaviTeja 100 Crore Deal with People Media factory: మాస్ మహారాజా రవితేజ తన సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వెళ్ళిపోతున్న సంగతి తెలిసిందే. ఆయన చేస్తున్న దాదాపు అన్ని సినిమాలు హిట్లవుతున్నా కొన్ని సినిమాలు మాత్రం మార్కెట్ పరంగా హిట్ అవ్వలేకపోతున్నాయి. అయినా సరే రవితేజ మాత్రం ఎక్కడా తగ్గకుండా రెమ్యూనరేషన్ పెంచుకుంటూ వెళుతున్నాడు. అయితే రవితేజతో మార్కెట్ వర్కౌట్ అవుతూ ఉండడంతో నిర్మాతలు కూడా ఆయన అడిగినంత ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక ఆసక్తికరమైన ప్రచారం టాలీవుడ్ వర్గాల్లో జరుగుతోంది. అదేంటంటే రవితేజ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థతో 100 కోట్ల రూపాయల డీల్ మాట్లాడుకున్నారు అని అంటున్నారు. అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతానికి రవితేజ కార్తీక్ ఘట్టమనేని డైరెక్షన్లో ఈగల్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తోంది. ఈ క్రమంలోనే ఆ నిర్మాతలతో రవితేజకు సన్నిహిత సంబంధాలు కూడా ఏర్పడ్డాయి.
Nani 31: భయపెట్టేందుకు సిద్ధమవుతున్న నాని?
ఇక తెలుగులో అతివేగంగా 100 సినిమాలు నిర్మించాలని టార్గెట్ పెట్టుకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ రవితేజతో ఒక డీల్ కూడా మాట్లాడుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అదేమిటంటే ఇప్పుడు చేస్తున్న సినిమాతో పాటు మరో మూడు సినిమాలు కూడా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకు రవితేజ చేసి పెట్టాలి, అలా చేసినందుకుగాను ఒక్కొక్క సినిమాకు పాతిక కోట్ల రూపాయలు చొప్పున మొత్తం 100 కోట్ల రూపాయల డీల్ ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. అందులో ఒక సినిమా కలర్ ఫోటో ఫ్రేమ్ దర్శకుడు సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కించే అవకాశం ఉందని, మరో రెండు సినిమాలకు సంబంధించిన కథలు దర్శకులు ఫైనల్ చేయాల్సి ఉందని తెలుస్తోంది. మొత్తం మీద 100 సినిమాలు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థకు రవితేజ లాంటి మార్కెట్ ఉన్న హీరో దొరకడంతో వాళ్లు ఆయననే లాక్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక రవితేజకు కూడా తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించుకునే స్కోప్ కూడా దొరకడంతో ఆయన కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చెబుతున్నారు. ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయనేది చూడాలి మరి.