Nani coming up with a dark thriller: నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. చివరిగా దసరా అనే సినిమాతో హిట్ అందుకున్న నాని ప్రస్తుతానికి శౌర్యవ్ అనే ఒక కొత్త దర్శకుడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కథ ఆసక్తికరంగా, కొత్తగా ఉండే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా పూర్తయిన తర్వాత నాని వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో ఒక సినిమా చేయాల్సి ఉంది. అయితే ఈ సినిమా గురించి ఒక ఆసక్తికర ప్రచారం అయితే అనూహ్యంగా తెరమీదకు వచ్చింది. అది ఏమిటంటే ఈ సినిమా ఒక డార్క్ థ్రిల్లర్గా తెరకెక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి శ్రీవిష్ణు హీరోగా బ్రోచేవారెవరురా అనే సినిమా డైరెక్ట్ చేసిన వివేక్ ఆత్రేయ నానితో ముందుగా డార్క్ థ్రిల్లర్ తెరకెక్కించాలని అనుకున్నాడట.
Guntur Kaaram: థమన్ ఉన్నాడు కానీ పూజా ఔట్.. అసలు కారణం అదేనట?
కానీ ఈ లోపు మైత్రి మూవీ మేకర్స్ సంస్థ సంప్రదించి నానితో ఒక ఎంటర్టైనర్ ప్లాన్ చేయమని ఆఫర్ ఇవ్వడంతో ఆయన అంటే సుందరానికి అనే సినిమా ప్లాన్ చేశారు. అయితే ఆ సినిమా పెద్దగా వర్కౌట్ అవలేదు. ఇక ఇప్పుడు డివివి దానయ్య నిర్మాతగా డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మించేందుకు ఒక డార్క్ థ్రిల్లర్ సబ్జెక్ట్ ని ఆయన సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అంటే సుందరానికి సినిమా ఫలితంతో సంబంధం లేకుండానే నాని వివేక్ ఆత్రేయ చెప్పిన కథకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని, వివేక్ ఆత్రేయ మీద నాని ఎంతో నమ్మకం ఉంచాడని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం నాని నటిస్తున్న 30వ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఈ 31 వ సినిమా షూటింగ్ కూడా పట్టాలు ఎక్కే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ప్రస్తుతం నాని నటిస్తున్న సినిమాల్లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా వివేక్ ఆత్రేయనాని కాంబినేషన్లో తెరకెక్కబోతున్న సినిమాలో హీరోయిన్ ఎవరు అనే విషయం మీద ప్రస్తుతానికైతే క్లారిటీ లేదు.