మాస్ మహారాజా రవితేజ హీరోయిన్ తో లిప్ లాక్ చేస్తున్న పిక్ ఒకటి లీక్ అయ్యింది. ప్రస్తుతం ఆ పిక్ నెట్టింట్లో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే… సాధారణంగా రవితేజ తన సినిమాల్లో లిప్ లోక్ సన్నివేశాలకు దూరంగా ఉంటాడు. కేవలం రొమాంటిక్ సన్నివేశాలతోనే ప్రేక్షకులను అలరిస్తుంటాడు. అయితే ఆయన ఇప్పుడు ఈ రూల్ ను పక్కన పెట్టి లిప్ లాక్ సీన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టున్నాడు. “ఖిలాడీ” సినిమా హీరోయిన్ డింపుల్ హయాతీని రవితేజ ముద్దు పెట్టుకుంటున్న పిక్ తాజాగా లీక్ అయింది.
Read Also : “ఎఫ్ 3” ఫస్ట్ సింగిల్ ప్రోమో అవుట్
ఇదిలా ఉంటే రవితేజ ఈ సినిమాలోని హీరోయిన్లు ఇద్దరితో లిప్ లాక్ చేసినట్లు చెబుతున్నారు. ఈ సినిమాలో మీనాక్షి చౌదరితో పాటు డింపుల్ హయాతితో కూడా ఇలాంటి రొమాంటిక్ సన్నివేశాలు ఉండబోతున్నాయని టాక్. మాస్ మహారాజ కాస్తా రొమాంటిక్ రాజాగా మారి అభిమానులకు ట్రీట్ ఇవ్వబోతున్నాడన్నమాట. ఇప్పటివరకూ ‘ఖిలాడీ’ పోస్టర్స్ తో సీరియస్ మూవీ అనుకున్న వారంతా ఈ పిక్ లీక్ అవ్వడంతో మసాలాను కూడా బాగానే దట్టించినట్టున్నారని అభిప్రాయపడుతున్నారు. రమేష్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. కోనేరు సత్యనారాయణ నిర్మించిన ‘ఖిలాడీ’ ఫిబ్రవరి 11న విడుదల కానుంది.