బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌లో ఈ వారం ప్రేక్షకుల కోసం పెద్ద షాక్ ఇచ్చే విధంగా డబుల్ ఎలిమినేషన్ జరిగింది. ఇప్పటికే కొంతకాలంగా డబుల్ ఎలిమినేషన్ చర్చలు జరుగుతున్నా, ఐదో వారం సింగిల్ ఎలిమినేషన్ మాత్రమే జరుగుతుందనే ఊహలో ప్రేక్షకులు ఉండగా, సడెన్‌గా డబుల్ ఎలిమినేషన్ వచ్చి అందరిని ఆశ్చర్యపరచింది. ఫ్లోరా సైని ఓటింగ్‌లో తక్కువ రాబట్టడంతో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఆమె తర్వాత టాస్క్‌లో చివరి రౌండ్‌లో పోటీ చేసిన సుమన్ శెట్టి, దమ్ము శ్రీజలో దమ్ము శ్రీజ ఓడిపోయి హౌస్ నుంచి బయటకు వెళ్లి ఐదు వారాల సీజన్ నుండి హ్యాంగ్ అవుట్ ముగించారు. సెప్టెంబర్ 7న ప్రారంభమైన ఈ సీజన్‌లో ఫ్లోరా సైని సెలబ్రిటీగా హౌస్‌లో అడుగుపెట్టారు. ఆమెకు రోజుకు రూ. 30,000 పారితోషికం, వారానికి సుమారు రూ.2,10,000 ఇచ్చారు. ఐదు వారాలుగా ఇది కొనసాగించబడినందున, ఫ్లోరా సైని మొత్తం సుమారు రూ.10.5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ సంపాదించారని తెలుస్తోంది.
Also Read : Thamasur : ‘థామసూర్’లో యామీ – అదా కాంబినేషన్.. హారర్‌కి హాట్ టచ్!”
ఇక కామనర్‌గా ఎంట్రీ ఇచ్చి, హౌస్‌లోకి వచ్చిన దమ్ము శ్రీజకు రోజుకు రూ.12,000–15,000 వరకు పరితోషికం ఇచ్చారు. ఈ లెక్కన 7 వారాలకు సుమారుగా రూ. 3 లక్షలు లేదా రూ. 3 లక్షల 50 వేల వరకు సంపాదించినట్లు తెలుస్తోంది. కాబట్టి, ఈ వారం డబుల్ ఎలిమినేషన్‌లో ఎక్కువ సంపాదించిన కంటెస్టెంట్ ఫ్లోరా సైని. ఆమె ఇప్పటికే “నువ్వు నాకు నచ్చావ్” వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకోగా, బిగ్ బాస్‌లో కూడా ఆమె ధైర్యం, సొగసైన వ్యక్తిత్వం, ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రతిభతో ఎలిమినేట్ అయిన అభిమానుల అభిమానాన్ని నిలుపుకుంది. ఇక దమ్ము శ్రీజ హౌస్‌లో గట్టి పోటీ ఇస్తూ, ఆడపులి అనిపించినప్పటికీ చివరికి రెమ్యూనరేషన్ పరంగా ఫ్లోరా సైని ముందంజలో నిలిచారు.