Rishab Shetty: కన్నడ బ్యూటీ రష్మిక మందన్న గీతా గోవిందం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యిందన్న విషయం విదితమే. ఇక కన్నడలో కిర్రాక్ పార్టీ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యింది. ఆ సినిమాకు దర్శకత్వం వహించింది కాంతార హీరో రిషబ్ శెట్టి అని చాలా తక్కువమందికి తెలుసు. మొదటి నుంచి రష్మిక కు రిషబ్ శెట్టికి మధ్య విభేదాలు నెలకొన్నాయని వార్తలు గుప్పుమంటూనే వచ్చాయి. రిషబ్ తమ్ముడు రక్షిత్ ను కాదనుకొని వెళ్ళిపోయినందుకు కోపం ఉండొచ్చు అనేది కొందరి మాట. ఇక మరోసారి వీరి మధ్య గొడవ ఉందని రిషబ్ మాటలోనే తెలుస్తోంది. కన్నడ లో సూపర్ హిట్ అయిన కాంతార సినిమాను తాను ఇంకా చూడలేదని, సమయం కుదరలేదని చెప్పి అగ్గి రాజేసింది నేషనల్ క్రష్.
ఇక దీంతో అమ్మడిపై ట్రోల్స్ వీపరీతంగా వచ్చేశాయి. ఇక తాజాగా దానికి పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చాడు రిషబ్. ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి రష్మిక మందన్న ఇలా విభిన్నమైన హీరోయిన్స్ లలో మీరు ఎవరితో నటించాలని అనుకుంటున్నారు అన్న ప్రశ్నకు రిషబ్ మాట్లాడుతూ ” సాయి పల్లవి మంచి యాక్టర్, సమంత తో నటించాలని ఉంది. ఇక కొత్త హీరోయిన్లతో చేయడానికి ఇష్టపడతాను అని రష్మిక పేరును వదిలేస్తూ ఆమె సిగ్నేచర్ హ్యాండ్స్ ను చూపించి కౌంటర్ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. అయితే వీరి మధ్య గొడవకు కారణం ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియరాలేదు.