OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సెప్టెంబర్ 25 రచ్చ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదండోయ్.. మరో ముగ్గురు కూడా పవన్ క్రేజ్ మీదనే నమ్మకం పెట్టుకుని ఉన్నారు. వాళ్లే డైరెక్టర్ సుజీత్, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, నిర్మాత దానయ్య. సుజీత్ కు ఇది చావో రేవో అనే సినిమా అనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నో అంచనాలతో వచ్చిన సాహో పెద్దగా ఆకట్టుకోలేదు. చాలా గ్యాప్ తర్వాత ఆయన తీసిన ఓజీ సినిమాతో తానేంటూ నిరూపించుకోవాలి. ఇది హిట్ అయితేనే ఆయనకు మళ్లీ పెద్ద హీరోలతో సినిమా ఛాన్సులు వస్తాయి. లేదంటే అంతే సంగతి.
Read Also : OG : మెగా ఫ్యామిలీకి ఆ లోటును పవన్ తీరుస్తాడా..?
ప్రియాంక అరుల్ మోహన్ స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు లేక అల్లాడుతోంది. చిన్న సినిమాలతో సరిపెట్టుకుంటోంది. ఓజీతో పెద్ద హిట్ పడితే తనకు మళ్లీ స్టార్ హీరోల సినిమాల్లో ఛాన్సులు క్యూ కడుతాయని ఆశ పెట్టుకుంది. పవన్ కు భారీ క్రేజ్ ఉంది. ఓజీ ఏ మాత్రం హిట్ టాక్ తెచ్చుకున్న కలెక్షన్ల కోత పెరుగుతుంది. అది తనకు ప్లస్ అవుతుంది. ఇక నిర్మాత దానయ్య హిట్ చూసి చాలా కాలం అయింది. చాలా గ్యాప్ తర్వాత ఓజీతో వస్తున్నారు. ఈ సినిమాతో ఈ ఏడు హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చేయాలని చూస్తున్నారు. త్రిబుల్ తర్వాత పెద్ద హిట్ లేని ఆయనకు.. ఈ సినిమా ఆ లోటు తీరుస్తుందని నమ్ముతున్నారు. మరి పవన్ మీద ఈ ముగ్గురు పెట్టుకున్న అంచనాలు తీరుతాయా లేదా అన్నది చూడాలి.
Read Also : Avika Gor : పెళ్లి పీటలు ఎక్కబోతున్న క్రేజీ హీరోయిన్