Rana Daggubati: దగ్గుబాటి రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హీరోగా, నిర్మాతగా వరుస సినిమాలు చేస్తున్నాడ. ఇక ఈ మధ్యనే రానా నాయుడు సిరీస్ తో మెప్పించిన ఈ హీరో ప్రస్తుతం రానా నాయుడు 2 తో బిజీగా ఉన్నాడు. ఇక ఈవెంట్స్, పార్టీలకు రానా ఎప్పుడు ముందే ఉంటాడు. తాజాగా ఒక ఈవెంట్ లో రానాను బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కలిసింది. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. ఈ ఫొటోలో ఇద్దరు చాలా అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించారు. ఒక రాయల్ ప్యాలెస్ లా కనిపిస్తున్న ఒక భవనంలోని మెట్ల మీద వీరిద్దరూ కలిసి ఫోజ్ ఇచ్చారు. వైట్ సూట్, దానిపై క్యాప్ పెట్టుకొని రానా నిలబడగా.. స్టైలిష్ బ్లూ సూట్ వేసుకొని మృణాల్ అద్భుతంగా కనిపించింది.
Vijay: విజయ్ అతని ఫ్యాన్స్ తో నన్ను బూతులు తిట్టిస్తున్నాడు.. రాజేశ్వరి ప్రియ సంచలన వ్యాఖ్యలు
అయితే ఈ ఫోటో వెనుక ఉన్న స్టోరీ ఏంటి అనేది మాత్రం ఇంకా తెలియలేదు. వీరిద్దరూ కలిసి యాడ్ చేస్తున్నారా..? కొత్త సినిమా ఏదైనా చేస్తున్నారా..? అనేది మిస్టరీగా మారింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. రానా, మృణాల్ కలిసింది.. సైమా అవార్డ్స్ కోసమని తెలుస్తోంది. టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారిన ఈ అమ్మడికి సైమా అవార్డ్స్ 2023 కర్టెన్ రైజర్ కార్యక్రమానికి ఆహ్వానం అందింది అంట . దానికోసమే అమ్మడు ఇలా రానాతో ఫోటోలకు ఫోజులిచ్చింది అని అంటున్నారు. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు కొంపతీసి రానా నాయుడు 2 లో అయితే మృణాల్ లేదు కదా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. మరి ఈ జంట.. ఇలా కలవడానికి రీజన్ ఏంటి అనేది తెలియాలంటే వీరే నోరు విప్పాలి. ఇంకోపక్క మేయునల్ తెలుగులో వరుస సినిమాలతో బిజీగా మారింది. నాని, విజయ్ దేవరకొండ సినిమాలతో పాటు బాలీవుడ్ లో స్టార్ హీరోల సరసన నటించే ఛాన్స్ లను అందుకుంటుంది. మరి ముందు ముందు వీరు ఎక్కడ, ఎందుకు కలిశారో తెలుస్తుందేమో చూడాలి.