‘ఆర్ఆర్ఆర్’ ట్రైలర్ కొద్దిసేపటి క్రితం విడుదలైంది. ట్రైలర్ విడుదలైన క్షణాల్లోనే ఇంటర్నెట్ లో సెన్సేషన్ గా మారింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో నిర్మాతలు ట్రైలర్‌ను ప్రదర్శించారు. అనంతరం ఉదయం 11 గంటల సమయంలో యూట్యూబ్ లో విడుదల చేశారు. ఈ అద్భుతమైన ట్రైలర్‌ని చూసిన తర్వాత, బిగ్ స్క్రీన్‌పై సినిమాను చూసేందుకు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కాగా ఈరోజు ముంబయిలో సినిమాకు సంబంధించి ప్రెస్ మీట్ జరగనుంది. అక్కడ ట్రైలర్‌ను హిందీ మీడియాకు ప్రదర్శించనున్నారు. అంతేకాకుండా బి-టౌన్ మీడియాతో ఇంటరాక్ట్ కావడానికి ఈ చిత్ర తారాగణంతో పాటు సిబ్బంది ప్రెస్ మీట్‌కు హాజరు కానున్నారు. చిత్ర కథానాయకులలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ ఈరోజు ఉదయం ముంబై చేరుకున్నారు. అయితే ఈ సినిమాలోని మరో ప్రధాన హీరో రామ్ చరణ్ మాత్రం ఈ మీడియా ఇంటరాక్షన్‌కు హాజరు కావడం లేదు.
Read Also : రౌద్రం… రణం…రుధిరం… రియల్ మ్యాజిక్ ఆఫ్ రాజమౌళి!
అయితే రామ్ చరణ్ ఈ ఈవెంట్ కు హాజరు కాకపోవడానికి కారణం తన కుటుంబంలో జరుగుతున్న పెళ్లి వేడుక అని తెలుస్తోంది. చరణ్ భార్య ఉపాసన సోదరి అనుష్పలా కామినేని, అర్మాన్ ఇబ్రహీం పెళ్లి వేడుకలు జరుగుతున్నాయి. ఈ పెళ్లి సంబరాలల్లో బిజీగా ఉన్న చరణ్ ఈవెంట్ కు హాజరు కాలేకపోతున్నాడు. ఈ కార్యక్రమానికైతే ఆయన హాజరు కాలేకపోయాడు. కానీ మరికొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా జరగనున్న ప్రమోషన్స్‌లో రామ్ చరణ్ తప్పకుండా పాల్గొననున్నాడు. ఇక “ఆర్ఆర్ఆర్” 2022 జనవరి 7న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. ఈ పాన్ ఇండియా మూవీ IMAX, 3D, డోల్ బై సినిమా ఫార్మాట్‌లలో కూడా అందుబాటులో ఉంటుంది.