Sandeep Reddy : గ్లోబల్ స్టార్ రామ్ రణ్-ఉపాసన దంపతులు ఇండస్ట్రీలో చాలా మందికి స్పెషల్ గిఫ్ట్ లు పంపిస్తుంటారు. మరీ ముఖ్యంగా డైరెక్టర్లకు ఇలాంటి గిఫ్ట్ లు ఎక్కువగా ఇస్తుంటారు. తాజాగా స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాకు ఇలాంటి సర్ ప్రైజ్ గిఫ్ట్ పంపించారు. మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ అత్తమ్మాస్ కిచెన్ పేరుతో పలు రకాల ఫుడ్స్ తయారు చేసి అమ్ముతున్న సంగతి తెలిసిందే. ఈ సమ్మర్ లో స్పెషల్ గా పెట్టిన ఆవకాయ్ జాడీని సందీప్ రెడ్డికి పంపించారు రామ్ చరణ్ దంపతులు. ఈ విషయాన్ని సందీప్ రెడ్డి వంగా సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.
Read Also : Off The Record: ఏ విషయంలో వీహెచ్ కు కోపమొచ్చింది?
తనకు స్పెషల్ గిఫ్ట్ పంపించిన రామ్ చరణ్, ఉపాసనకు స్పెషల్ థాంక్స్ చెప్పాడు. టేస్ట్ చాలా బాగుందంటూ తెలిపాడు. ప్రస్తుతం సందీప్ రెడ్డి ప్రభాస్ తో స్పిరిట్ మూవీని తీస్తున్నాడు. త్వరలోనే దాని షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. రీసెంట్ గానే త్రిప్తి డిమ్రీని ఇందులోకి తీసుకున్నాడు. మిగతా నటీనటులను తీసుకునే పనిలో బిజీగా ఉన్నాడు సందీప్ రెడ్డి. ఇక రామ్ చరణ్ ఇప్పుడు పెద్ది సినిమాలో బిజీగా ఉన్నాడు. బుచ్చిబాబు సాన డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఆ మూవీ షూటింగ్ ప్రస్తుతం నార్త్ ఆంధ్రలో జరుగుతోంది. ఉత్తరాది బ్యాక్ డ్రాప్ లో వస్తోంది. స్పోర్ట్స్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ లుక్, అతని పర్ఫార్మెన్స్ చాలా డిఫరెంట్ గా ఉంది. ఇప్పటికే వచ్చిన ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకున్నాయి.
Read Also : Kannada Industry : క్షమాపణ చెప్పకుంటే థగ్ లైఫ్ బ్యాన్ చేస్తాం.. కన్నడ ఇండస్ట్రీ వార్నింగ్