టాలీవుడ్ ని ఒక ఊపు ఊపేసిన హీరోయిన్ లల్లో రకుల్ ప్రితిసింగ్ ఒకరు. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జత కట్టి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకుంది. ప్రజంట్ ఈ అమ్మడుకి తెలుగులో అవకాశాలు తగ్గినప్పటికీ.. ఇతర బాషాలో దూసుకుపోతుంది. ఇక మూవీస్ విషయం కాస్త పక్కన పెడితే. తాజాగా కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డి కుమార్తె బ్రహ్మణి వివాహం బెంగళూరులో ఎంతో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో రకుల్‌ప్రీత్ సింగ్ మంచి డ్యాన్స్ పర్ఫమెన్స్ ఇచ్చింది. కానీ ఎప్పుడైతే ఆమె ఈ మ్యారేజ్ లో ఆడిపాడిందో తనపై రకరకాల వార్తలు మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇవన్నీ రకుల్‌కు చాలా కోపం తెప్పించాయి. దీంతో తాజాగా ఈ విషయం పై మీడియాతో మాట్లాడింది..
Also Read:Tandel: ‘తండేల్’ 3 డే కలెక్షన్స్..దుల్ల గొట్టేస్తున్నాడుగా !
రకుల్ మాట్లాడుతూ ‘ జనాలు ఈ విషయాన్ని ఎందుకు వదలడంలేదో నాకు అర్థం కావడం లేదు. ముందు నేను ఈ డ్యాన్స్ ప్రోగ్రామ్ చేయడానికి ఒకటికి మూడింతల రెమ్యునరేషన్ తీసుకున్నానన్నారు. తర్వాత ఐటీ దాడి జరిగిందని ప్రచారం చేశారు. నాకు చాలా కోపాన్ని తెప్పిస్తోంది. ఈ రూమర్స్ తో మా నాన్న చాలా బాధపడుతున్నారు. ఒక్కరు కూడా నిజానిజాలు పరిశీలించడం లేదు, కనీసం నన్ను అడగడం లేదు. నేను మీడియాతో చాలా ఓపెన్‌గా ఉంటాను. నా జీవితానికి సంబంధించిన ప్రతి విషయాన్ని వారితో పంచుకుంటాను. మీకు నా గురించి ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడగండి. కానీ ఇలాంటి మాటలు మాత్రం పుట్టించోదు’అంటూ చెప్పుకొచ్చింది రకుల్. అయితే ఈ పెళ్లి లో రకుల్ మాత్రమే కాదు ప్రియమణి, తమన్నా కూడా డాన్స్ లు చేసినట్లు సమాచారం. కానీ వారికి సంబంధించిన వీడియో మాత్రం ఇంకా బయటకు రాలేదు.