రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సినిమా రాజాసాబ్. మారుతీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై భారీ ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. ప్రభాస్ కెరీస్ లో తొలిసారి హార్రర్ రొమాంటిక్ కామెడీ మూవీ చేస్తున్నాడు. అందులోను ప్రభాస్ రెండు విభిన్నమైన లుక్స్ లో కనిపిస్తున్నాడు. ఇప్పటికే రివీల్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, గ్లింప్స్‌కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. లేటెస్ట్ గా రాజాసాబ్ టీజర్ ను రిలీజ్ చేసారు మేకర్స్.
Also Read : GV Prakash : జీవి ప్రకాష్ ను చూసి ఇతర మ్యూజిక్ డైరెక్టర్లు నేర్చుకోవాలి
ఎప్పటినుండో ఈ సినిమా టీజర్ కోసం ఎదురు చుసిన ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు మారుతీ. వింటేజ్ ప్రభాస్ ను మరోసారి చూపించదు. నిన్న విడుదలైన ఈ సినిమా టీజర్ అద్భుతమైన స్పందనతో పాటు రికార్డ్ మిలియన్ వ్యూస్ రాబడుతోంది. ఇప్పటి వరకు రిలీజ్ అయిన 24 గంటల్లో రాజా సాబ్ ట్రైలర్ 59 మిలియన్ వ్యూస్ రాబట్టి యు ట్యూబ్ ట్రెండింగ్ లో నంబర్ 1 లో దూసుకెళ్తుంది. రికారు మిలియన్ వ్యూస్ రాబట్టడంతో రెబల్ స్టార్ మరోసారి తన సత్తా ఏమిటో చూపించాడని ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నఈ సినిమా ఈ ఏడాది డిసెంబరు 5న థియేటర్లలోకి సందడి చేయనుంది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ లతో రెబల్ స్టార్ రొమాన్స్ చేయబోతున్నాడు. ఈ ముగ్గురు భామలతో కలిసి ప్రభాస్ చేయబోయే మాస్ సాంగ్ సినిమాకే హైలెట్ గా నిలవబోతుందట. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ పై పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టిజి విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు.