సౌత్ స్టార్ హీరోలకు ఫస్ట్ ఛాయిస్‌గా మారాడు అనిరుధ్. కోలీవుడ్, టాలీవుడ్‌లో అతడికి పీక్స్ డిమాండ్ ఉంది. ఒకప్పుడు దేవీ శ్రీ ప్రసాద్ ఆ ప్లేసులో ఉండేవాడు. కానీ కొన్ని రోజులుగా ఆన్ టైంకి మ్యూజిక్ ఇవ్వట్లేదన్న కాంట్రవర్సీలను ఎదుర్కొంటున్నాడు. పుష్ప టూ రీసెంట్లీ కుబేర వరకు కూడా చివరి నిమిషం వరకు సాంగ్స్ ఇవ్వకుండా ఫిల్మ్ మేకర్లను ఇబ్బందికి గురి చేస్తున్నాడన్న గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. తమన్‌కున్న కమిట్మెంట్స్ వేరే లెవల్ బాలయ్య టూ పవన్ కళ్యాణ్ వయా ప్రభాస్ చిత్రాలు అతడి ఖాతాలో ఉన్నాయి. దీంతో నెక్ట్స్ ఛాయిస్‌గా జీవీవైపు చూస్తోంది ఫిల్మీ వుడ్. చెప్పాలంటే దేవీనే జీవీ వైపు ఫిల్మ్ మేకర్లు చూసేలా చేస్తున్నాడని టాక్.
Also Read : Puri Jagannadh : తమిళ ‘బెగ్గర్’తో మలయాళ కుట్టి రొమాన్స్
గుడ్ బ్యాడ్ అగ్లీ కి మొదట దేవీ నే మ్యూజిక్ డైరెక్టర్ కానీ తరువాత జరిగిన పరిణామాలతో దేవీ ప్లేసులోకి జీవీని రీ ప్లేస్ చేసింది మైత్రీ మూవీ మేకర్స్. జీవి ఇచ్చిన మ్యూజిక్ గుడ్ బాడ్ అగ్లీ విజయంలో కీలక పాత్ర పోషించింది. దేవిశ్రీ ప్రసాద్ హావ తగ్గడంతో నెక్ట్స్ జీవీ ప్రకాష్‌పై సౌత్ ఇండస్ట్రీ ఆధారపడుతోంది. కోలీవుడ్ మాత్రమే కాదు టాలీవుడ్ కూడా వరుస ఆఫర్లను అందిస్తోంది. ప్రజెంట్ తమిళంలో గంపెడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇడ్లీకడాయ్, పరాశక్తి,, మన్నాడీ, వాడివాసల్, మాస్క్ చేస్తున్నాడు. పరాశక్తి అతడి కెరీర్‌లో మైల్ స్టోన్ వందవ సినిమాగా వస్తుంది. ఇటు తెలుగులో కూడా టూ ఫిల్మ్స్‌కు కమిటయ్యాడు. సూర్య- వెంకీ అట్లూరి మూవీకి అతడే ఫిక్స్ కాగా, రీసెంట్లీ దుల్కర్ సల్మాన్ మూవీ ఆకాశంలో ఒకతారకు ఫైనల్ అయ్యాడు. మ్యూజిక్ డైరెక్టరుగా ఇంత బిజీలోనూ యాక్టింగ్ వదులుకోలేదు ఈ టాలెంటర్. హీరోగా అరడజన్ సినిమాలున్నాయి. వాటిల్లో కొన్నింటికీ కూడా అతడే కంపోజర్. ఇవే కాదు లైవ్ కాన్సర్ట్స్ నిర్వహిస్తూ మెస్మరైజ్ చేస్తున్నాడు. ఒక్క సినిమాకు ఆర్ఆర్, మ్యూజిక్ ఇవ్వడానికి సంవత్సరాలు తీసుకుంటున్నారు స్టార్ మ్యూజిక్ డైరెక్టర్స్. కానీ జీవి చేసిన ప్రతి సినిమాకు తన వంతు న్యాయం చేస్తున్నాడు.