దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన మోస్ట్ అవైటెడ్ పీరియాడిక్ డ్రామా “ఆర్ఆర్ఆర్”. భారీ అంచనాలతో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా ఇద్దరు నిజమైన స్వాతంత్ర్య సమరయోధులు అల్లూరి సీతారామ రాజు, కొమురం భీం మధ్య కల్పిత స్నేహం చుట్టూ తిరుగుతుంది. గిరిజన నాయకుడు భీమ్‌గా జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండగా, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమా విడుదలకు దగ్గర పడుతున్న కారణంగా ప్రచార కార్యక్రమాలను మరింత వేగవంతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.
Read Also : విజయ్ సేతుపతిని తంతే నగదు బహుమతి… హిందుత్వ సంస్థ షాకింగ్ ప్రకటన !!
ఇటీవల మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా రాజమౌళి తన భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామా “ఆర్ఆర్ఆర్” నుండి ఒక ప్రత్యేక డైలాగ్‌ను లీక్ చేశాడు. “యుద్ధాన్ని వెతుక్కుంటూ ఆయుధాలు అవే వస్తాయి. అది ధర్మ యుద్ధం అయితే విజయం తథ్యం” అంటూ సినిమాలోని ఓ పవర్ ఫుల్ డైలాగ్ ను వదిలాడు రాజమౌళి. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ పీరియాడికల్ డ్రామా జనవరి 7, 2022న భారీ ఎత్తున విడుదలకు సిద్ధంగా ఉంది. అలియా భట్, శ్రియా శరణ్, అజయ్ దేవ్, ఒలివియా మోరిస్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.