Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమాల నుంచి అప్డేట్ వచ్చి చాలా రోజులు అవుతోంది. దీంతో ఫ్యాన్స్ కోసం అర్జెంటుగా ఓ టీజర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారంట. ఆయన నటిస్తున్న ది రాజాసాబ్ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావడానికి వచ్చింది. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పూర్తి హర్రర్ థ్రిల్లర్ గా రాబోతోంది. ఇందులో ప్రభాస్ లుక్ ఇప్పటికే సెన్సేషన్ క్రియట్ చేసింది. ఈ మూవీ డబ్బింగ్ ప్రస్తుతం జరుగుతోంది. ప్రభాస్ డబ్బింగ్ లో రెండు రోజుల్లో జాయిన్ అవుతాడంట.
Read Also : Pakistan: భారత్‌ని మరిచిపోండి, పాకిస్తాన్ ఈ రెండు రాష్ట్రాల GDPని కూడా దాటలేదు..
డబ్బింగ్ పూర్తి అయిన వెంటనే మూవీ టీజర్ ను ఈ నెలాఖరులో రిలీజ్ చేస్తారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటి వరకు ప్రభాస్ ను ఎన్నడూ చూడని కొత్త లుక్ లో చూడబోతున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ ఇప్పటి వరకు హర్రర్ సినిమాల జోలికి పోలేదు. కాబట్టి ఎలా ఉంటాడో.. మూవీ ఎలా ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఇది మరో చంద్రముఖి అవుతుందనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. ఇందులో ప్రభాస్ లుక్ ను చూస్తే.. చంద్రముఖి సినిమాలో వెంకటపతి రాజా లుక్ గుర్తుకు రాక మానదు.
కామెడీ సినిమాలు తీసే మారుతి.. ఈ మూవీని ఎలా తీస్తాడో చూడాల్సి ఉంది. మొన్ననే ఇటలీ ట్రిప్ నుంచి వచ్చిన ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు. ఓ వైపు రాజాసాబ్ పనులు చేస్తూనే.. ఇంకో వైపు ఫౌజీ షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు. అది త్వరగా కంప్లీట్ చేసేసి స్పిరిట్ సినిమాను మొదలు పెట్టాలని చూస్తున్నాడంట. త్వరలోనే దానికి సంబంధించిన అప్డేట్ కూడా రాబోతోంది. ఆ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఫౌజీ తర్వాత వచ్చే సినిమాలు అన్నీ భారీ బడ్జెట్ తో వస్తున్నవే. స్పిరిట్, కల్కీ-2, సలార్-2 పాన్ ఇండియాను ఊపేస్తున్న సినిమాలు. కాబట్టి ఫౌజీని త్వరగా ఫినిష్ చేయాలని ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రభాస్.
Read Also : Karthik Dandu : మమ్మల్ని కాపీ అంటారు మరి మీరు? మీడియాకి డైరెక్టర్ కౌంటరు