Karthik Dandu : నాగచైతన్య హీరోగా, విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ వర్మ దండు దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భోగవల్లి బాపినీడు నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకి సంబంధించి ఇప్పటికే షూటింగ్ మొదలైంది. 10 రోజుల షూటింగ్ కూడా పూర్తయింది. ఈ సినిమాలో 20 నిమిషాల పాటు కీలకంగా ఉంటుందని భావిస్తున్న ఒక గుహ ఎపిసోడ్ కోసం గుహ సెట్ వేసింది సినిమా టీం. ఆ సెట్ ఎక్స్‌పీరియన్స్ చేయించడం కోసం మీడియా ప్రతినిధులను సెట్‌కి ఆహ్వానించింది. అయితే, ఆ తర్వాత మీడియాతో కూడా ముచ్చటించారు సినీ యూనిట్. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులలో కొంతమందికి కొన్ని ప్రశ్నలు సంధిస్తూ, కొన్ని చోట్ల ట్రెజర్ హంట్ లాగా వెతకాల్సిందిగా కోరారు.
Read Also : Nagachaitanya : ఏడాది ముందే మీడియాకి సెట్ చూపించిన నాగ చైతన్య సినిమా టీం
ఈ క్రమంలోనే ఒక మీడియా ప్రతినిధి చిట్ తీయగా, అందులో “మీరు ఉన్న ప్రదేశం పేరు, గోదావరి పుట్టిన ప్రదేశం పేరు ఒకటే” అని ఉంది. అయితే, మీడియా ప్రతినిధులు అందరూ త్రయంబకం, నాసిక్ అంటూ పేర్లు చెబుతూ ఉండగా, దర్శకుడు అవేమీ కాదన్నారు. ఇక ఈ క్రమంలో ఒక మీడియా ప్రతినిధి గూగుల్ చేసి అది బ్రహ్మగిరి అనడంతో, ముందు డైరెక్టర్ అభినందించారు. తర్వాత గూగుల్ చేసి తెలుసుకున్నారని విన్న వెంటనే, “ఇది భలే ఉంది! మేము ఏదైనా ఇంగ్లీష్ సినిమా నుంచి ఇన్స్పైర్ అయ్యి ఒకటి రెండు సీన్లు తీస్తే కాపీ కొట్టారని అంటారు. మీరు మాత్రం గూగుల్ చేసి సమాధానం చెప్పొచ్చా?” అంటూ కౌంటర్ వేశారు. దీంతో అక్కడ ఉన్న వారందరూ నవ్వేశారు.
Read Also : HHVM : ‘వీరమల్లు’ రాకతో కన్నప్ప, కుబేరకు ఊహించని షాక్..?