ఎట్టకేలకు “రాధే శ్యామ్” రెండవ రౌండ్ ప్రమోషన్స్ మొదలయ్యాయి. పలు వాయిదాల అనంతరం “రాధే శ్యామ్” విడుదలకు సిద్ధమయ్యాడు. బుధవారం మేకర్స్ విడుదల చేసిన ట్రైలర్ సినిమా గురించి చాలా కాలంగా ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు మంచి ట్రీట్ అయ్యిందని చెప్పొచ్చు. ముంబైలోని పివిఆర్ జుహులో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మేకర్స్ రిలీజ్ ట్రైలర్ ని ఆవిష్కరించారు. కానీ తెలుగు ట్రైలర్‌లో పొరపాటు జరగడంతో మేకర్స్ దానిని డిలీట్ చేసి, మళ్లీ అప్‌లోడ్ చేయడం గమనార్హం. అయితే చాలామంది ఆ మిస్టేక్ ఏంటి? అని ఆలోచిస్తున్నారు.
Read Also : RadheShyam Trailer: ప్రేమ విషయంలో విక్రమాదిత్య విఫలమయ్యాడా..?
విషయంలోకి వస్తే… ఈ పీరియాడికల్ రొమాంటిక్ డ్రామాలో రెబల్ స్టార్ కృష్ణంరాజు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. తమిళంలో కృష్ణంరాజు పాత్ర కోసం సత్యరాజ్‌ని తీసుకున్నారు. అయితే తెలుగు ట్రైలర్ లో కృష్ణంరాజు స్థానంలో సత్యరాజ్ ని చూపించారు. నెటిజన్లు దాన్ని ఎత్తి చూపడంతో మేకర్స్ తప్పును సరిదిద్దిన మేకర్స్ ఆ ట్రైలర్ ను డిలీట్ చేసి కొత్త ట్రైలర్ ను అప్‌లోడ్ చేశారు. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా, రాధా కృష్ణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, కన్నడ భాషల్లో మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో విడుదల కానుంది.