Ponniyan Selvan: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న చిత్రం పొన్నియన్ సెల్వన్. విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్ లాంటి స్టార్ క్యాస్టింగ్ తో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 30 న అన్ని భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో ప్రమోషన్స్ వేగవంతం చేసిన మేకర్స్ లిరికల్ వీడియో సాంగ్స్ ను ఒక్కొక్కటిగా వదులుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ‘రాచ్చస మావయ్య’ అనే సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. కార్తీ, త్రిష, శోభిత ధూళిపాళ్ల ఈ సాంగ్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
“మత్తెక్కిటు వస్తున్నావా.. పెద్దత్తకు భర్త.. నిన్నొత్తి గిల్లి బుద్ది కొంచెం ఇస్తా” అంటూ మొదలైన ఈ సాంగ్ ఆద్యంతం ఊపును తెప్పిస్తోంది. రాచ్చస మావయ్య.. రాత్రి వేళ సూర్యుడా.. నీ చచ్చు బుద్ధి మారదా అంటూ శ్రీకృష్ణుడి గెటప్ లో శోభితా ధూళిపాళ్ల పాడుతూ ఉండగా.. రాక్షసుడు గెటప్ లో కార్తీ దర్శనమిస్తాడు. ఇక ఈ గెటప్ కోసం కార్తీ ఎంత కష్టపడ్డాడో వీడియో చూస్తే తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ సాంగ్ కు అనంత్ శ్రీరామ్ వినసొంపైన వాక్యాలు అందించగా.. శ్రేయ ఘోషల్, శంకర్ మహదేవన్, మహేష్ వినయక్రమ్ మెస్మరైజ్ వాయిస్ తో ఆలపించారు. సాంగ్ విజువల్స్ ఎంతో అద్భుతంగా ఉన్నాయి. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా మణిరత్నం ఈ సినిమాను తెరక్కించాడని సాంగ్ చూస్తుంటే అర్ధమవుతోంది. ఇక ఈ పాటను బట్టి దేవుడుకు, రాక్షసుడుకు మధ్య యుద్ధం జరుగుతున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి ఈ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.