Puri Jagannath: డేరింగ్ అండ్ డ్యాషింగ్ పూరి జగన్నాథ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విజయాపజయాలు పూరి పట్టించుకోడు అనేది అందరికి తెల్సిందే. నేనింతే సినిమాలో చెప్పినట్లు ప్లాప్ అయినా ఇంకో సినిమా తీస్తాడు.. హిట్ అయినా ఇంకో తీస్తాడు.. ఎందుకంటే పూరికి తెల్సింది సినిమా తీయడమే.. ఇక ఇటీవలే పూరి దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ రిలీజ్ అయ్యి పరాజయం పాలయ్యింది. పూరి కెరీర్ లోనే వరస్ట్ సినిమాల్లో ఇదొకటిగా నిలిచింది. ఇక ఇప్పటివరకు ఈ సినిమా ప్లాప్ పై పూరి నోరెత్తింది లేదు. ఇక ఎట్టకేలకు లైగర్ ప్లాప్ పై నోరు విప్పాడు. ఇటీవల చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమాలో కనిపించిన పూరి.. ఈ సినిమా సక్సెస్ అయ్యాకా చిరును ఆన్లైన్ ఇంటర్వ్యూ చేశాడు.
ఇక ఈ ఇంటర్వ్యూలో పూరి మాట్లాడుతూ ” నేను లైగర్ సినిమా ప్లాప్ అయ్యిందని విన్నాక .. పొద్దునే జిమ్ కు వెళ్లి 100 స్క్వాట్స్ చేసి లైగర్ ను మర్చిపోయాను” అని చెప్పుకొచ్చాడు. ఏంటండీ ఇది.. సినిమాపై కోట్లు నష్టం వస్తే స్క్వాట్స్ చేసి మర్చిపోయానని చెప్తున్నాడు అని కొందరు.. అవును లే అందులో సగం డబ్బు నీది కాదుగా ఇప్పటికి నిర్మాతలు స్క్వాట్స్ వేస్తూనే ఉన్నారు ఈ సినిమా నష్టాలు చూసి అని మరికొందరు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం పూరి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.