TG Vishwaprasad : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మంచి హిట్ అయింది. దీంతో ఈ సినిమాకు ప్రీక్వెల్, సీక్వెల్ ఉంటాయని క్లారిటీ ఇచ్చారు. సీక్వెల్ లో అకీరా నటిస్తాడనే ప్రచారం జరుగుతోంది. అయితే అకీరా మొదటి సినిమాను నిర్మాత విశ్వ ప్రసాద్ నిర్మించబోతున్నారనే రూమర్లు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. వాటిపై తాజాగా టీజీ విశ్వ ప్రసాద్ ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో క్లారిటీ ఇచ్చారు. ఆ అవకాశం కచ్చితంగా నేనే నిర్మిస్తాను అంటూ తెలిపారు. దీంతో ఈ కామెంట్స్ క్షణాల్లోనే సోషల్ మీడియాను చుట్టేస్తున్నాయి.
Read Also : TG Vishwa Prasad : ఆ డైరెక్టర్ కు అడ్వాన్స్ ఇచ్చా.. చిరుతో మూవీ వస్తుందో లేదో
ఇక పవన్ కల్యాణ్ కు తాను అడ్వాన్స్ ఇచ్చాననే వార్తలను ఆయన ఖండించారు. అందులో నిజం లేదని తెలిపారు. పవన్ కల్యాణ్ కొడుకుగా అకీరాకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. అకీరాకు సంబంధించిన వీడియోలు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి అకీరాతో ఎవరు సినిమా చేసినా మంచి క్రేజ్ ఏర్పడటం ఖాయం. ఇప్పట్లో అకీరా ఎంట్రీ ఉంటుందా లేదా అనేది తెలియదు. రీసెంట్ గానే అతను తన యాక్టింగ్ కోర్స్ కంప్లీట్ చేసుకుని వచ్చాడని మాత్రం తెలుస్తోంది.
Read Also : Upasana : చిరంజీవి ఇంట్లో పూజ.. ఉపాసన ఏం చేసిందో చూడండి