TG Vishwa Prasad : నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఇప్పుడు మంచి జోష్ మీదున్నాడు. ఆయన నిర్మించిన మిరాయ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. భారీ లాభాలను తెచ్చిపెట్టింది ఈ సినిమా. దీంతో ఇన్ని రోజులకు సరైన హిట్ పడటంతో విశ్వ ప్రసాద్ మంచి ఖుషీలో ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన ఎన్టీవీ పాడ్ కాస్ట్ లో మాట్లాడారు. డైరెక్టర్లకు అడ్వాన్స్ ఇవ్వడం నిర్మాతలకు ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ అని తెలిపారు. తాను కూడా డైరెక్టర్ బాబీకి ఏడేళ్ల క్రితం అడ్వాన్స్ ఇచ్చానని.. చిరంజీవితో బాబీ చేసే సినిమాలో ఏమైనా ఛాన్స్ వస్తుందో లేదో కూడా తెలియదన్నారు.
Read Also : Upasana : చిరంజీవి ఇంట్లో పూజ.. ఉపాసన ఏం చేసిందో చూడండి
కొన్ని సినిమాలకు నిర్మాణం కాకపోయినా.. ఇంకేదైనా విషయంలో భాగస్వామిని అయ్యేవాడినని.. ఇప్పుడు చిరంజీవికి అలాంటి ఛాన్స్ వస్తుందనే నమ్మకం కూడా లేదన్నారు విశ్వ ప్రసాద్. ఆదిపురుష్ సినిమాకు నష్టపోయిన కారణంతోనే రాజాసాబ్ సినిమా ఆఫర్ వచ్చిందనే రూమర్లపై కూడా ఆయన స్పందించారు. మిరాయ్ సినిమా అంత పెద్ద హిట్ కావడం వెనక ఉన్న కారణాలను వివరించారు. వీఎఫ్ ఎక్స్ అనేది నేడు సినిమాలో ఎంత కీలకంగా మారిందో వివరించారు విశ్వ ప్రసాద్. ఆయన చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
Read Also : Sanjana Galrani : ఆ హీరో నన్ను టార్చర్ చేశాడు.. చేయి పట్టుకుని లాగి..