సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి జంటగా వచ్చిన ‘డీజే టిల్లు’ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలుసు. మంచి బజ్ తో విడుదలైన ఈ సినిమా.. అంచనాలకి మించి కలెక్షన్లు కొల్లగొట్టి, డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. త్రిల్లింగ్ సబ్జెక్ట్ తో పాటు యూత్ ని ఆకట్టుకునే త్రిల్లింగ్ కామెడీ బోలెడంత ఉండటంతో, యువత దీనికి బ్రహ్మరథం పట్టారు. కొన్ని రోజుల పాటు థియేటర్ల వద్ద ఈ సినిమా హవానే సాగింది. ఆ తర్వాత సీక్వెల్ కి డిమాండ్ కూడా పెరిగింది. సినిమా ఎలాగో పెద్ద హిట్ అయ్యింది, సీక్వెల్ కి ఆస్కారం ఉంది కాబట్టి.. యూనిట్ సీక్వెల్ కి శ్రీకారం చుట్టేశారు.
అవును, మీరు చదువుతోంది అక్షరాల నిజం. స్వయంగా నిర్మాత నాగవంశీ డిజే టిల్లు సీక్వెల్ ని ప్రకటించారు. అంతేకాదు.. ఒక చిన్న పూజా కార్యక్రమాన్ని సైతం హైదరాబాద్ లో నిర్వహించారు. ఇందుకు సంబంధించిన ఒక ఫోటోని షేర్ చేశారు కూడా. ఆగస్టు నుంచి ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుందని, మరో క్రేజీ అడ్వెంచర్ కోసం సిద్ధంగా ఉండడని నాగవంశీ తెలిపారు. చూస్తుంటే, ఈ ఏడాది చివర్లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేలా కనిపిస్తోంది. లేకపోతే, సంక్రాంతి బరిలో దిగొచ్చు. కాకపోతే, ఆ సమయంలో పెద్ద సినిమాలకు చాలానే ఉన్నాయి. మరి, మేకర్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.
నిర్మాత నాగవంశీ సినిమానైతే ప్రకటించాడు కానీ, దర్శకుడు & నటీనటుల వివరాల్ని వెల్లడించలేదు. ఆ పాత క్యాస్ట్ & టెక్నీషియన్లే ఈ సీక్వెల్ ని పని చేస్తారా? లేకపోతే కొత్తవారిని రంగంలోకి దింపుతారా? అసలు ఇది మొదటి భాగానికి కొనసాగింపా? లేకపోతే కొత్త కథతో తీస్తారా? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే, కొన్ని రోజుల వరకు వెయిట్ చేయాల్సిందే!