టాలీవుడ్ సినీ ప్రేమికులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రాజెక్ట్ లలో ‘SSMB 29’ ఒకటి. ఎస్ఎస్ రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీ పై ప్రేక్షకుల అంచనాలు భారీగా నెలకొన్నాయి.త్వరలోనే ఈ సినిమా షూటింగ్ కూడా మొదలుపెట్టనున్నారు. అయితే ఈ మూవీలో మహేష్ బాబు సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించనుందని తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి వర్క్ షాప్ ఫ్రీ లుక్ టెస్ట్ అన్ని కూడా పూర్తి చేసుకున్నట్టు సమాచారం.అయితే తాజాగా ‘SSMB 29’ కోసం ప్రియాంక తీసుకుంటున్న రెమ్యూనరేషన్‌కు గురించి ఓ వార్త వైరల్ అవుతుంది.
తాజాగా ఈ మూవీ కోసం ప్రియాంక ఏకంగా సుమారు రూ.20 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతోంది. కానీ హాలీవుడ్ మీడియా మాత్రం సుమారు రూ.40 కోట్లు వరకు ఉంటుందని కథనాలు ప్రచురించాయి. ఎందుకంటే ఈ ముద్దుగుమ్మ హాలీవుడ్ యాక్షన్ వెబ్ సిరీస్ ‘సీటాడెల్’ చిత్రం కోసం ఐదు మిలియన్ డాలర్ల పారితోషికం అందుకుందట..
అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.45 కోట్ల పైమాటే.. అంటే ఇక్కడ ఆమె ఫుల్ లెన్త్ హీరోయిన్ గా చేస్తే దాదాపు దానికి డబుల్ రెమ్యూనరేషన్ తీసుకుంటుందమాట. అంతేకాదు ఆమెకు అంత పెద్ద మొత్తంలో పారితోషికం ఇచ్చేందుకు నిర్మాత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని తెలుస్తోంది. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ, ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రజంట్ ప్రియాంక సంపాదించుకున్న క్రేజ్‌ని బట్టి చూస్తే మహేష్ మూవీకి ఆమె బాగానే డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.