Priyanka Chopra : సినిమా ఇండస్ట్రీలో బాడీ షేవింగ్ అనేది ఎంత కామన్ అయిపోయిందో మనం చూస్తున్నాం. ఇప్పుడు స్టార్లుగా ఉన్న వాళ్లు కూడా ఒకప్పుడు బాడీ షేమింగ్ ఎదుర్కొన్న వాళ్లే. కొందరు తమకు ఎదురైనా అవమానాలను బయటపెడుతుంటారు. తాజాగా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా తనకు ఎదురైన ఇలాంటి అవమానాలను బయటపెట్టింది. మనకు తెలిసిందే కదా ప్రియాంక చోప్రా ఒకప్పుడు మోడల్ గా చేసిన తర్వాత సినిమా ఇండస్ట్రీ లోకి ఎంటర్ ఇచ్చింది. అయితే బాలీవుడ్ లో అవకాశాల కోసం వెతుకుతున్నప్పుడు కొందరు డైరెక్టర్లు ఆమెను చూసి.. నువ్వు నల్లగా ఉన్నావు.. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ గా పనికిరావు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే బెటర్ అంటూ సలహాలు ఇచ్చారంట. అవి విన్న తనకు చాలా బాధగా అనిపించి కొన్ని రోజులు డిప్రెషన్ లోకి వెళ్లినట్టు తెలిపింది.
Read Also : Sree Leela : అలాంటి వాడినే పెళ్లి చేసుకుంటా.. శ్రీలీల కోరికలు విన్నారా
కానీ మళ్ళీ తనను తాను నమ్ముకుని.. ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలని అనేక సవాలను దాటుకొని హీరోయిన్ గా ఎదిగినట్టు తెలిపింది. తనను అవమానించిన వారే తాను హీరోయిన్ గా ఎదిగినపుడు తన దగ్గరకు వచ్చి అవకాశాల కోసం వేడుకున్నారని తెలిపింది. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని.. మన కష్టాన్ని మన టాలెంట్ ను నమ్ముకుని ముందుకు వెళితే అదే మనకు మంచి పోసిషన్ తీసుకువస్తున్నట్టు తెలిపింది ఈ బ్యూటీ. ప్రస్తుతం ప్రియాంక చోప్రా సూపర్ స్టార్ మహేష్ బాబు తో భారీ ప్రాజెక్టు చేస్తున్న విషయం తెలిసిందే. రాజమౌళి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి నవంబర్ లో భారీ అప్డేట్ రాబోతోంది.
Read Also : Baahubali The Epic : బాహుబలి ది ఎపిక్ పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన సెంథిల్