Priyanka Chopra : బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ లో ఉంటుంది. రాజమౌళి డైరెక్షన్ లో మహేశ్ బాబు హీరోగా వస్తున్న గ్లోబ్ ట్రాటర్ సినిమాలో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. హాలీవుడ్ రేంజ్ కు ఎదిగిన ప్రియాంక చోప్రాకు తెలుగులో ఇదే ఫస్ట్ మూవీ అని అంతా అనుకుంటున్నారు. కానీ ఆమె దీని కంటే ముందే తెలుగులో ఓ సినిమాలో నటించింది. ప్రియాంక 2002లో విజయ్‌తో కలిసి ‘తమిళన్’ అనే సినిమాతో కోలీవుడ్‌లో అడుగు పెట్టింది.
Read Also : SSMB 29 : ఈవెంట్ కోసం రాజమౌళి ప్లానింగ్.. సుమ స్పెషల్ వీడియో
ఆ టైమ్ లోనే తెలుగులో అపురూపం అనే మూవలో నటించింది. జి.ఎస్. రవికుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో హీరోయిన్‌గా ప్రియాంకను తీసుకున్నారు. ఈ సినిమాలో మధుకర్, ప్రసన్న ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రియాంకకు సంబంధించిన కొన్ని సీన్లు షూటింగ్ అయ్యాయి. పోస్టర్లు కూడా రిలీజ్ చేశారు. కానీ నిర్మాతలకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ రావడంతో మూవీని రిలీజ్ చేయకుండానే ఆపేశారు. ఇప్పటికీ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాలేదు.
Read Also : PM Modi: కాంగ్రెస్ MMC పార్టీగా మారింది..