ప్రభాస్-ప్రశాంత్ నీల్ కలిసి చేస్తున్న పాన్ ఇండియా సినిమా సలార్. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ నుంచి పార్ట్ 1 సీజ్ ఫైర్ డిసెంబర్ 22న ఆడియన్స్ ముందుకి రానుంది. ఒక స్ట్రామ్ లా బాక్సాఫీస్ ని ముంచేత్తాదనికి వస్తున్న ఈ సినిమాపై హ్యూజ్ హైప్ ఉంది. అన్ని సెంటర్స్ బుకింగ్స్ చూస్తుంటే ఇండియాస్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ డే రికార్డుని పెట్టేలా కనిపిస్తున్నాడు ప్రభాస్. ప్రమోషన్స్ ని పెద్దగా చేయకపోయినా ప్రభాస్ పేరు మాత్రమే సలార్ సినిమాపై అంచనాలు పెంచింది. ఇంత బజ్ జనరేట్ అవ్వడానికి ఏకైక కారణం ప్రభాస్ మాత్రమే. హోంబలే మేకర్స్ మాత్రం సలార్ విషయంలో అంతగా ప్రమోషన్స్ చెయ్యలేదనే చెప్పాలి. ఒక్క సాంగ్ లాంచ్ కే ఈవెంట్స్ చేస్తున్నాయి మిగిలిన సినిమాలు… సలార్ మాత్రం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కూడా చెయ్యలేదు. ఎప్పుడో ఓపెనింగ్ సెరిమోనీలో ప్రభాస్-ప్రశాంత్ నీల్ మీడియాతో మాట్లాడడమే తప్ప అప్పటినుంచి ఇప్పటివరకు సలార్ మీడియా ఇంటరాక్షన్ ఒక్కటి కూడా జరగలేదు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ పక్కన పెట్టండి, కనీసం ప్రీరిలీజ్ ఈవెంట్ కూడా చెయ్యట్లేదు.
ప్రభాస్ వద్దన్నాడా లేక ఉన్న హైప్ చాలు అనుకున్నారా, కావాలనే అండర్ ప్లే చేస్తున్నారా అనేది తెలియదు కానీ సలార్ ని మాత్రం మేకర్స్ సైలెంట్ గా ఉంచారు. సరేలే ప్రమోషనల్ ఈవెంట్స్ లేవు కనీసం ప్రమోషనల్ కంటెంట్ అయినా వదులుతారా అంటే హోంబలే మేకర్స్ ఇక్కడ కూడా ప్రభాస్ ఫ్యాన్స్ ని ఊరించే పనిలో ఉన్నారు. సలార్ హైప్ ని స్కై హైకి తీసుకోని వెళ్ళడానికి, ఫైనల్ పంచ్ గా రిలీజ్ ట్రైలర్ బయటకి రావాల్సి ఉంది. నిన్నే రిలీజ్ చేస్తారనుకున్న ట్రైలర్, టెక్నీకల్ ఇష్యూతో ఈరోజూ ఉదయానికి వాయిదా పడింది. ఉదయం 10:45 నిమిషాలకి బయటకి రావాల్సిన ట్రైలర్ కోసం ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తుంటే ఇప్పుడు ట్రైలర్ 2 గంటలకి వస్తుంది అంటూ వాయిదా ట్వీట్ వేశారు మేకర్స్. చివరి నిమిషంలో ఇలా ఎందుకు జరుగుతుంది అనేది హోంబలే ఫిల్మ్స్ వాళ్లకి మాత్రమే తెలియాలి. కనీసం 2 గంటలకి అయినా రిలీజ్ ట్రైలర్ ని వదులుతారా లేక మళ్లీ వాయిదా వేస్తారా అనేది చూడాలి.
The #SalaarReleaseTrailer might have hit the snooze button, but fear not! It's set to be out 2 PM 🔥 Stay Tuned!
— Hombale Films (@hombalefilms) December 18, 2023