ఈ జనరేషన్ కి పాన్ ఇండియా అనే పదాన్ని పరిచయం చేసిన హీరో ప్రభాస్. ఈ రెబల్ స్టార్ నుంచి సినిమా వస్తుంది అంటే టాక్ తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బ్రేక్ అవుతాయి, కొత్త హిస్టరీ క్రియేట్ అవుతుంది. బాహుబలి తర్వాత వచ్చిన మూడు సినిమాలు ఫ్లాప్ అయినా ప్రభాస్ మార్కెట్ చెక్కు చెదరలేదు, అందుకే ప్రభాస్ ని ఈ జనరేషన్ చూసిన ఇండియాస్ బిగ్గెస్ట్ హీరో అంటారు. ఇలాంటి ప్రభాస్, ప్రశాంత్ నీల్ తో కలిసి సలార్ సినిమా చేసాడు. ఈ ఫ్రాంచైజ్ నుంచి పార్ట్ 1, సీజ్ ఫైర్ సినిమా సెప్టెంబర్ 28న ఆడియన్స్ ముందుకి రావాల్సి ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో సలార్ ట్రైలర్ బయటకి వస్తుంది, ఈ ట్రైలర్ క్రియేట్ చేసే హైప్ తో సెప్టెంబర్ 28న బాక్సాఫీస్ షేప్ షకల్ మార్చేయాలని ప్రభాస్ ఫ్యాన్స్ అనుకున్నారు. ఇంతలో సలార్ వాయిదా అనే వార్త బయటకి వచ్చింది. ఇది అఫీషియల్ గా వచ్చిన వార్తనా లేక రూమర్ మాత్రమేనా అనేది తెలుసుకోవడానికే ఫ్యాన్స్ కి రెండు రోజుల సమయం పట్టింది.
ఇప్పటికీ కొంతమంది ప్రభాస్ ఫ్యాన్స్ సలార్ వాయిదా పడింది అంటే నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ ఒక్క సినిమా వాయిదా వేయడం వలన అన్ని భాషల్లో సినిమాల రిలీజ్ డేట్స్ మారిపోవాల్సి వచ్చింది. కొన్ని సినిమాలు వెనక్కి, మరి కొన్ని సినిమా ముందుకి వచ్చి సెప్టెంబర్ 28న తమ సినిమాలని రిలీజ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాయి. సలార్ మేకర్స్ నుంచి ఇప్పటికీ ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకి రాలేదు. సినిమా వాయిదా వేసాం, త్వరలో కొత్త డేట్ తో వస్తాం అనే మాటే చెప్పడం లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ ని దర్శక నిర్మాతలు తీసుకునే అంత గ్రాంటెడ్ గా ఎవరు తీసుకోరు, ఇదే ఇతర హీరోల అభిమానులు అయి ఉంటే ఈ పాటికి ప్రొడక్షన్ హౌజ్ పైన హ్యూజ్ నెగటివ్ ట్రెండ్ ని చేసే వాళ్లు. మేకర్స్ ఇప్పటికైనా కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తే బాగుంటుంది.