సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కలిసి చేసిన సినిమా సలార్. ఈ మూవీ నుంచి ఫస్ట్ పార్ట్ సీజ్ ఫైర్ ఈరోజు రిలీజ్ అయ్యింది. ఆల్మోస్ట్ అన్ని సెంటర్స్ నుంచి యునానిమస్ పాజిటివ్ టాక్ రావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. సీజ్ ఫైర్ కోసం సెప్టెంబర్ 28 నుంచి ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ లవర్స్ కి పూనకాలు తెప్పించే స్టఫ్ ని ఇచ్చాడు ప్రశాంత్ నీల్. ప్రభాస్ ని ఇప్పటివరకూ ఏ దర్శకుడు ఈ రేంజులో ప్రెజెంట్ చేయలేదు. ఇది పూర్తిగా ప్రభాస్ వన్ మ్యాన్ షో చేసిన సినిమా. ఈ సినిమాతో ప్రభాస్ తాను ఇండియాస్ బిగ్గెస్ట్ హీరో అని ప్రూవ్ చేసాడు. ప్రభాస్ కనపడితే చాలు ఫ్యాన్స్ చేత థియేటర్స్ టాప్ లేచిపోయే రేంజులో అరిపించాడు ప్రశాంత్ నీల్.
సలార్ సీజ్ ఫైర్ ఎండింగ్ మిస్ అవ్వకండి అని చెప్పిన ప్రశాంత్ నీల్… అందుకు తగ్గట్లుగానే క్లైమాక్స్ కంప్లీట్ అయ్యాకా, ఎండ్ క్రెడిట్స్ పడే ముందు అదిరిపోయే సీక్వెన్స్ ని పెట్టాడు. ప్రభాస్ తో చొక్కా విప్పించి అభిమానుల చొక్కాలు చింపుకునేలా చేసిన ప్రశాంత్ నీల్… సలార్ పార్ట్ 2 టైటిల్ “శౌర్యాంగ పర్వం” అని రివీల్ చేసాడు. ప్రభాస్-పృథ్వీల మధ్య ఉన్న స్నేహం వైరంగా ఎలా మారింది అనే పాయింట్ తో పాటు ప్రభాస్ ప్లే చేసిన దేవరథ క్యారెక్టర్ కి ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చి… ఆ ట్విస్ట్ తో శౌర్యాంగ పర్వం సినిమాని రన్ చేయబోతున్నాడు ప్రశాంత్ నీల్. ఈ మూవీ రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రశాంత్ నీల్ చెప్పలేదు కానీ వీలైనంత త్వరగా వస్తే మాత్రం బాహుబలి 2 రికార్డులు కూడా చెల్లాచెదురు అవ్వడం గ్యారెంటీ.