Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా మారాడు. బాహుబలి సినిమా దగ్గరనుంచి తన రేంజ్ ను అలా అలా పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. స్టార్ హీరో నుంచి ఇప్పుడు వరల్డ్ హీరోగా ప్రభాస్ మారిపోయాడు. ఇక ప్రభాస్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రాల్లో ప్రాజెక్ట్ కె ఒకటి. మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన దీపికా పదుకొనే నటిస్తుండగా.. బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక నేడు ఈ చిత్రంలో లోక నాయకుడు కమల్ హాసన్ కూడా నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ప్రతి ఒక్క హీరోకు తమకు ఇన్సిపైర్ ఇచ్చిన హీరోలతో నటించాలని కోరిక ఉంటుంది. కమల్ హాసన్ లాంటి నటుడితో నటించాలని ప్రతి ఒక్క హీరో కలలు కంటూ ఉంటారు. అది నిజమైన రోజు.. ఆ హీరోకు అంతకు మించిన సక్సెస్ ఉండదు. తాజాగా ప్రభాస్ కు అలాంటి సక్సెస్ అందిందని అభిమానులు చెప్పుకొస్తున్నారు. అందుకు నిదర్శనంగా ఒక పాత వీడియోను కూడా చూపిస్తున్నారు.
గతంలో ఒక మూవీ ప్రమోషన్స్ లో ప్రభాస్ తో పాటు కమల్ ముఖ్య అతిధిగా విచ్చేశాడు. కమల్ పక్కన ప్రభాస్ కూర్చోని.. ఆయన గురించి మాట్లాడుతూ.. ” ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఆయన పక్కన కూర్చునే అదృష్టం లభించింది. కనీసం ఆయనకు నా పేరు కూడా తెలియదనుకుంటా.. సర్.. నేను ప్రభాస్” అని పరిచయం చేసుకున్నాడు. ఇక అందుకు కమల్.. నవ్వుతూ ప్రభాస్ భుజంపై తట్టి ఆశీర్వదించాడు. ఇక ఇప్పుడు అదే కమల్.. ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తున్నాడు. ఇదే కదా సక్సెస్ అంటే.. ఎక్కడ నుంచి ఎక్కడ వరకు వచ్చాం అనేది మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనమేంటి అనేది ఆటోమేటిక్ గా కనిపించేస్తుంది అని ప్రభాస్ అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.